ETV Bharat / international

ఇండోనేసియా భూకంపంలో 46కు చేరిన మృతులు

ఇండోనేసియా భూకంప మృతుల సంఖ్య 46కు చేరింది. శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన ఈ ఘటనలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

death-toll-from-earthquake-in-indonesia-rises-to
ఇండోనేసియా భూకంపంలో 46కు చేరిన మృతులు
author img

By

Published : Jan 17, 2021, 5:04 AM IST

ఇండోనేసియా భూకంపంలో మరణించిన వారి సంఖ్య 46కు పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అవరసమైతే మరో రెండు వారాల పాటు అత్యయిక స్థితిని అమల్లో ఉంచుతామని అధికారులు తెలిపారు.

సులవేసి దీవిలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో కొందరు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి 60కిపైగా భవనాలు కుప్పకూలినట్లు ఇండోనేసియా డిజాస్టర్‌ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడం వల్ల చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు.

డిజాస్టర్‌ ఏజెన్సీ సమాచారం ప్రకారం మజెని ప్రాంతంలో 637 మంది, మముజు ప్రాంతంలో 20 మందికి పైగా గాయపడ్డారు.

'రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌'గా పిలిచే ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: కూలిన వాయుసేన హెలికాఫ్టర్.. ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.