చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీని(పీఎల్ఏ) చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) ప్రశంసించింది. వాస్తవాధీనరేఖ వెంబడి భారత్‌తో సరిహద్దు (China army at Indian border) ఘర్షణలు ఉన్న నేపథ్యంలో సరిహద్దులో భారీ ఆపరేషన్లు చేపట్టడం, పోరాట ప్రతిమను కనబరచడంపై పీఎల్ఏను కొనియాడింది సీపీసీ.
కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ చైనా(China CPC meeting) ఆధ్వర్యంలో.. గతవారం నిర్వహించిన ఉన్నతస్థాయి కాంక్లేవ్‌లో.. చారిత్రక తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశంలో గడచిన 100ఏళ్లలో సాధించిన విజయాలపైనా తీర్మానంలో పేర్కొంది. అంతేకాక ప్రస్తుత దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మూడోసారి పగ్గాలు అందించాలని నిర్ణయించింది.
మంగళవారం రాత్రి విడుదల చేసిన ఈ తీర్మానంలో(China CPC meeting) జిన్‌పింగ్ సేవలు, 20లక్షలకుపైగా ఉన్న చైనా సైనిక సిబ్బందిని శక్తిమంతంగా తయారుచేయటం.. తదితర వివరాలు ఉన్నాయి.
బయటి శక్తులను తిప్పికొట్టేవిధంగా.. చైనా ఆర్మీ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ తీర్మానంలో ఉంది. వాస్తవాధీనరేఖ వెంబడి భారత్‌తో సరిహద్దు (China army at Indian border) ఘర్షణలు ఉన్న నేపథ్యంలో సరిహద్దులో భారీస్థాయిలో కార్యకలాపాలు చేపట్టడాన్ని ప్రస్తావించింది. 2027 నాటికి తమలక్ష్యాలను అధిగమించాలని తీర్మానించింది. 2035నాటికి ఆధునిక పద్ధతిలో ఆర్మీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక.. చైనా రక్షణరంగం బలోపేతం అయింది. దేశ బడ్జెట్లో రక్షణరంగానికి అధిక బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వచ్చారు. ఈ ఏడాది చైనా రక్షణరంగానికి కేటాయించిన బడ్జెట్ 200బిలియన్డాలర్లు దాటింది.
ఇదీ చూడండి: 'అంగుళం భూమినీ ఆక్రమించుకోలేదు'