ETV Bharat / international

'అప్పుడే అయిపోలేదు.. ఉగ్రరూపం ఇప్పుడే మొదలైంది' - corona pandemic in india

భారత్​లో కరోనా మహమ్మారి ఇంకా ఉగ్రరూపం దాల్చలేదని, ఆ ముప్పు ఇంకా ఉందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తివేయడమే ఇందుకు కారణమని చెప్పారు. భారత్​లోని వివిధ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం భిన్నంగా ఉందన్నారు.

COVID-19 not 'exploded' in India but risk remains: WHO expert
'అప్పుడే అయిపోలేదు..కరోనా ముప్పు ఇంకా ఉంది'
author img

By

Published : Jun 6, 2020, 1:24 PM IST

భారత్​కు కరోనా మహమ్మారి అసలు ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్​ తీవ్ర రూపం దాల్చనప్పటికీ లాక్​డౌన్ ఆంక్షలు ఇప్పుడు సడిలిస్తున్న కారణంగా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్​, పాకిస్థాన్ వంటి దక్షిణాసియా దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు.

భారత్​లో కరోనా కేసుల రెట్టింపు సమయం 3 వారాలుగా ఉందని తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్​ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్​ మైకేల్​ ర్యాన్. ప్రభుత్వం చేపట్టిన లాక్​డౌన్​ వంటి చర్యల కారణంగా వైరస్ వ్యాప్తి కట్టడి అయినట్లు పేర్కొన్నారు. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి భిన్నంగా ఉందన్నారు.

ఇప్పుడు లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తివేశాక అన్ని దేశాల్లోనూ వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని ర్యాన్ అన్నారు. భారత్​లో వలస కార్మికులు, పట్టణ ప్రాంతాల్లో అధిక జనసాంద్రత వంటి ప్రధాన సమస్యలున్నట్లు చెప్పారు.

కరోనా కేసులలో ఇటలీని దాటేసి ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది భారత్. 2 లక్షల 36 వేలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 6 వేల 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఎక్కువే అయినప్పటికీ దేశ జనాభాతో పోల్చి చూస్తే తక్కువేనని డబ్ల్యూహెచ్​వో సీనియర్ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్​ చెప్పారు. లాక్​డౌన్​ ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు తెరుచుకున్న నేపథ్యంలో కనీస ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.