ETV Bharat / international

పీఓకేపై పాక్ వివక్ష- పీపీఈ కిట్లపై 'పాన్'​ మరకలు - పీఓకేలో కరోనా వైరస్

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఆస్పత్రులు ఎంతటి దారుణ స్థితిలో ఉన్నాయో మరోమారు తేటతెల్లమైంది. వాడేసిన పీపీఈ కిట్లను అక్కడి ఆస్పత్రులకు ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం పంపినట్లు వెల్లడైంది.

pakisthan
పీఓకే ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లపై పాన్​ మరకలు
author img

By

Published : May 20, 2020, 4:59 PM IST

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లో వైద్య సదుపాయాలు దారుణంగా ఉన్నాయని మరోసారి రుజువైంది. ముజఫరాబాద్​లోని షేక్​ ఖలీఫా బిన్​ జాయిద్​ కంబైన్​డ్​ మిలిటరీ ఆసుపత్రి(సీఎంహెచ్​)కి ఉపయోగించిన వ్యక్తిగత సంరక్షణ పరికరాల(పీపీఈ)లను ఇచ్చారని అక్కడి వైద్యులు ఆరోపిస్తున్నారు. వాటిపై పాన్​ మరకలు ఉన్నట్లు అధికారులు ఫిర్యాదు చేశారు.

"ఏజేకే (పాక్ ఆక్రమిత కశ్మీర్​)లోని ఆసుపత్రులకు రావల్పిండి మిలిటరీ ఆసుపత్రి నుంచి 3 లక్షల పీపీఈ కిట్లు సరఫరా అయ్యాయి. మా ఆసుపత్రికి వచ్చినవాటిలో ఇప్పటికే ఉపయోగించిన కిట్లు ఉన్నాయి. కొన్ని మాస్కులపై ఎర్రటి మరకలు ఉన్నాయి. ల్యాబ్​ల్లో పరీక్షించగా.. అవి పాన్​ మరకలని తేలింది."

- సీఎంహెచ్​ ముజఫరాబాద్​

ఎలాంటి ఇన్ఫెక్షన్​ సోకకుండా ఆసుపత్రి నిబంధనల ప్రకారం వాటన్నింటినీ ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. చైనాలో తయారైన నకిలీ నిర్దరణ పరీక్షా యంత్రాన్ని ఇటీవల అందించారని.. ఇప్పుడు ఇలా పడేసే కిట్లను ఇవ్వటం నిజంగా సిగ్గు చేటని వారు వాపోయారు.

పీఓకేపై వివక్ష..

ఇప్పటికే పీఓకేలోని ఆసుపత్రులకు పీపీఈ కిట్లు అందించటంలో విఫలమైందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. సంరక్షణ పరికరాల లేమి కారణంగా ఆసుపత్రులకు వెళ్లేందుకు చాలా మంది ఆరోగ్య సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఫలితంగా కరోనా వైరస్ పరీక్షలు, చికిత్సపై ప్రభావం పడుతోంది.

పీఓకే, గిల్గిత్ బాల్టిస్థాన్​ విషయంలో పాక్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇది ఆ ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పీఓకేలో ఇప్పటివరకు 133 కేసులు నమోదు అయ్యాయి. గిల్గిత్ బాల్టిస్థాన్​లో 556 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది.

పాక్​లో కరోనా విజృంభణ..

పాకిస్థాన్​లో కరోనా వైరస్​ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా 1,932 కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 45,898కు చేరింది. 985 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 4 లక్షలకుపైగా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 13,962 మందిని పరీక్షించారు.

పాక్​లో సింధ్ రాష్ట్రంలో అత్యధికంగా 17,947 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో పంజాబ్​ 16 వేల కేసులు, ఖైబర్​ పఖ్తుంఖ్వా 6,554 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ లాక్​డౌన్​ ఆంక్షలను సడలిస్తోంది పాక్. ఇప్పటికే దేశీయ విమాన సేవలను పాక్షికంగా ప్రారంభించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.