ETV Bharat / international

క్వారంటైన్​ ఆంక్షలు ఉల్లంఘిస్తే రూ. 95 వేలు జరిమానా! - Covid-19 death toll in world

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 33 లక్షల 61 వేలు దాటింది. 10 లక్షల 3 వేల మందికి పైగా మహమ్మారికి బలయ్యారు. భారత్​, బ్రెజిల్​, రష్యా దేశాల్లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి.

Covid-19 fresh cases and deaths in the Global
క్వారంటైన్​ ఆంక్షలు ఉల్లంఘిస్తే రూ. 95 వేలు జరిమానా
author img

By

Published : Sep 28, 2020, 10:48 PM IST

ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 33 లక్షల 61 వేలు దాటింది. మరణాలు సంఖ్య 10 లక్షల 3 వేల 191కు చేరింది. అయితే కొవిడ్​ నుంచి కొలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 2 కోట్ల 46 లక్షల 68 వేల మందికి పైగా మహమ్మారిని జయించారు.

బ్రిటన్​లో జరిమానా..

కరోనా సోకిన వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది బ్రిటన్ ప్రభుత్వం. దీని కోసం జరిమానా విధిస్తుంది. కరోనా సోకిన వ్యక్తులు తొలి కొవిడ్​ క్వారంటైన్​ ఆంక్షలు ఉల్లంఘిస్తే 1000 పౌండ్లు(సుమారు రూ. 95 వేలు), పునరావృతం చేస్తే 10,000 పౌండ్ల వరకు జరిమానా విధించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిని సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.

  • సింగపూర్​లో కొవిడ్​ కేసులు తగ్గుతుండటం వల్ల లాక్​డౌన్​ ఆంక్షలను దశలవారీగా ఎత్తివేస్తున్నారు. గత వారం ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి గన్​ కిమ్​ యోంగ్ ప్రకటన మేరకు... కరోనా నిబంధనలను పాటిస్తూ ఉద్యోగులు తమ విధులు నిర్వహించుకుంటున్నారు.
  • రష్యాలో కొత్తగా 8,135 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మరో 61మంది చనిపోయారు.
  • నేపాల్​లో కొత్తగా 1,351 వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75 వేలకు చేరువైంది.
  • పాక్​లో కొత్తగా 566 మంది కరోనా బారిన పడగా.. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 10 దాటింది. తొమ్మిది కొత్త మరణాలతో కలిపి ఇప్పటివరకు 6,466 మంది చనిపోయారు.
దేశం మొత్తం కేసులుమొత్తం మరణాలు
అమెరికా 73,22,3912,09,470
భారత్​60,83,88895,626
బ్రెజిల్​47,32,3091,41,776
రష్యా11,59,57320,385
కొలంబియా8,13,05625,488

ఇదీ చూడండి: కరోనా భౌతిక దూరానికి 'బంప్​'తో చెక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.