ETV Bharat / international

కరోనా పంజా: 20వేలకు చేరువైన మరణాలు

author img

By

Published : Mar 25, 2020, 9:05 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు 19,246 మంది మృతి చెందారు. మరో 4,27,640 మందికి వైరస్​ సోకింది. మొత్తం 181 దేశాలకు ఈ మహమ్మారి వ్యాప్తి చెందింది.

Coronavirus toll at 1100 GMT Wednesday
ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు చేరువగా కరోనా మరణాలు

కరోనా వైరస్​ మరణ మృదంగం మోగిస్తోంది. 181 దేశాలకు వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి 19,246 మందిని బలి తీసుకుంది. మొత్తం 4,27,940 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

వేర్వేరు దేశాల్లో కరోనా కేసులు ఇలా...

  • ఫిబ్రవరిలో తొలి మరణం సంభవించిన ఇటలీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా వేలాది మంది కరోనాకు బలయ్యారు.
  • స్పెయిన్​లోనూ వైరస్​ వీరవిహారం చేస్తోంది. మృతుల సంఖ్యలో వైరస్ కేంద్రబిందువైన చైనాను కూడా దాటేసింది స్పెయిన్​.
  • ఇరాన్​లోనూ కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి రోజురోజుకూ వందలాదిమంది మృత్యుఒడిని చేరుతున్నారు. ఇప్పటివరకు 27 వేల మందికి పైగా కరోనా పాజిటివ్​గా తెలింది.
  • బ్రిటన్​ యువరాజు ఛార్లెస్​ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే యువరాణికి మాత్రం వైరస్​ నెగటివ్​గా వచ్చింది.
  • పాకిస్థాన్​లోనూ కరోనా కేసులు 1000కి చేరువైనందున.. దేశంలో విమాన సర్వీసులను రద్దు చేసింది ఇమ్రాన్​ సర్కార్​.​

ఇదీ చూడండి : సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.