ETV Bharat / international

టోఫెల్​, జీఆర్​ఈ పరీక్షలు ఇంటిలోనే రాసుకోండి: ఈటీఎస్​

టోఫెల్​-జీఆర్​ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఊరట కలిగించేలా 'ఎడ్యుకేషన్​ టెస్టింగ్ సర్వీస్' (ఈటీఎస్​) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఇంటి వద్దే ఈ ప్రపంచ స్థాయి అర్హత పరీక్షలు రాసే వీలు కల్పించింది. అయితే చైనా, ఇరాన్​లో ఈ పరీక్షలు నిర్వహించడం లేదని పేర్కొంది.

author img

By

Published : Apr 3, 2020, 11:52 AM IST

Coronavirus: Students to take global exams TOEFL, GRE at home
టోఫెల్​, జీఆర్​ఈ పరీక్షలు ఇంటిలోనే రాసుకోండి: ఈటీఎస్​

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచమంతా లాక్​డౌన్​ అయిన నేపథ్యంలో ఎడ్యుకేషనల్​ టెస్టింగ్ సర్వీస్​ (ఈటీఎస్​) కీలక నిర్ణయం తీసుకుంది. టోఫెల్​, జీఆర్​ఈ లాంటి ప్రపంచ స్థాయి పరీక్షలను... విద్యార్థులు ఇంటిలోనే ఉండి రాసే వీలు కల్పించింది. అయితే ఈ పరీక్షలు చైనా, ఇరాన్​ దేశాల్లో నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది.

"కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు రాయలేకపోతున్న విద్యార్థులకు ఇప్పుడు ఓ పరిష్కారం లభిస్తుంది. పరీక్ష కేంద్రాల్లో టెస్ట్​లు నిర్వహించడానికి అనుకూల పరిస్థితి ఏర్పడేంత వరకు టోఫెల్​, జీఆర్​ఈ పరీక్షలు ఇంట్లోనే రాసుకునేందుకు వీలు కల్పిస్తాం."

- శ్రీకాంత్ గోపాల్​, టోఫెల్​ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​

పటిష్ఠ భద్రత నడుమ

ఇంటి వద్ద రాసే ఈ పరీక్షల చెల్లుబాటు, విశ్వసనీయత, భద్రత కోసం అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రియల్​ టైమ్​ హ్యూమన్ మానిటరింగ్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ) రెండింటినీ ఉపయోగించి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.

కరోనా దెబ్బకు

టెస్ట్​ ఆఫ్ ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజ్ (టోఫెల్​), గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్స్​ (జీఆర్​ఈ)... ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే పరీక్షలు. కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఈ పరీక్షలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు- ఆగని మృత్యుఘోష​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.