ETV Bharat / international

విరోచనాలా? అయితే కరోనా అయి ఉండొచ్చు! - కరోనా వైరస్​

కరోనా వైరస్​ సోకితే తొలుత దగ్గు, తమ్ము వంటి లక్షణాలు బయటపడతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే చిన్నారుల్లో మాత్రం ఈ లక్షణాలు భిన్నంగా ఉంటున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. వైరస్​.. తొలుత వారి పేగులపై దాడి చేస్తుండటం వల్ల.. విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలు వెలుగుచూస్తున్నాయని పేర్కొంది. అందువల్ల ఎవరికైనా విరోచనాలు, జ్వరం మొదలైన లక్షణాలు ఉంటే వైరస్​ సోకినట్టు అనుమానించాలని స్పష్టం చేసింది.

Coronavirus infection in children may not start with coughs: Study
విరోచనాలు, జ్వరం ఉన్నా కరోనా సోకినట్టే!
author img

By

Published : May 12, 2020, 2:23 PM IST

దగ్గు, తుమ్ము, జలుబు.. కరోనా ప్రధాన లక్షణాలు. అయితే వైరస్​ సోకిన చిన్నారుల్లో మాత్రం లక్షణాలు తొలుత భిన్నంగా ఉంటున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఎలాంటి శ్వాస సంబంధిత సమస్యలు లేనప్పటికీ.. విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలుంటే పిల్లలకు కరోనా సోకినట్టు అనుమానించాల్సిందేనని పేర్కొంది.

ఫ్రాంటియర్స్​ జర్నల్​లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. కరోనా వైరస్​ సోకిన తొలినాళ్లలో గ్యాస్ట్రో ఇంటస్టైనల్​ లక్షణాలతో చిన్నారులు సతమతమవుతున్నారు. అంటే వారి జీర్ణకోశ వ్యవస్థపై కరోనా వైరస్​ తొలుత దాడి చేస్తోందని అర్థమవుతోంది.

వైరస్​ రిసెప్టర్లు దాడి చేసే ఊపిరితిత్తుల్లోని కణాలే.. పేగుల్లోను ఉంటాయని పరిశోధకులు తెలిపారు. అందుకే వైరస్​ సోకిన పిల్లల్లో విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలు తొలుత బయటపడతున్నాయని వివరించారు.

శ్వాస సంబంధిత లక్షణాలు లేనప్పటికీ.. పిల్లలు నిమోనియా, కరోనా వైరస్​ బారినపడినట్టు గుర్తించామని పరిశోధకులు తెలిపారు.

మూత్రపిండాల్లో రాళ్లు, తీవ్రమైన తల నొప్పి వంటి సమస్యలకు చికిత్స తీసుకుంటున్న పిల్లలకు కరోనా పరీక్షలు చేయగా.. వారికీ పాజిటివ్​గా తేలినట్టు అధ్యయనం సహ రచయిత, చైనా టోంగ్జీ ఆసుపత్రిలోని పీడియాట్రిక్స్​ విభాగం సభ్యుడు వెన్​బిన్​ లీ తెలిపారు. చిన్నారులందరికీ నిమోనియా సోకిందని.. ఆ తర్వాత వైరస్​ నిర్ధరణ అయిందని వివరించారు.

ఐదుగురు చిన్నారులపై ఈ పరిశోధనలు జరిపినట్టు లీ తెలిపారు. వీరందరిలోనూ తొలుత ఇదే తరహా లక్షణాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. అయితే మరింత కచ్చితత్వం కోసం ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు జరపాలని వెల్లడించారు లీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.