ETV Bharat / international

లాక్​డౌన్​లో ప్రపంచం- చైనాలో 31 కొత్త కేసులు - కరోనా వైరస్​ చైనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. వైరస్​కు కేంద్రబిందువు చైనాలో తాజాగా 31మందికి కరోనా​ సోకింది. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అటు అమెరికానూ వైరస్​ గడగడలాడిస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్​ కరోనా ధాటికి విలవిలలాడుతోంది.

Coronavirus: China reports 4 deaths, 31 new cases
లాక్​డౌన్​లో ప్రపంచం.. చైనాలో మరో 31 కొత్త కేసులు
author img

By

Published : Mar 30, 2020, 12:06 PM IST

చైనాలో కరోనా వైరస్​ బారిన పడుతున్న విదేశీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో తాజాగా 31 కేసులు నమోదుకాగా.. అందులో 30మంది విదేశీయులే ఉన్నారు. దీని వల్ల వైరస్​ సోకిన విదేశీయుల సంఖ్య 723కు చేరింది.

చైనాలో ఇప్పటివరకు మొత్తం 81,470 కేసులు నమోదయ్యాయి. వీరిలో 75వేల 770మంది వైరస్​ను జయించారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరోవైపు మహమ్మారితో తాజాగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 3వేల 304కు చేరింది.

న్యూయార్క్​...

అమెరికాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్​ వైరస్​ కేంద్రబిందువుగా మారింది.​ దేశం మొత్తంలో 2 వేల 485 మరణాలు సంభవించగా.. ఒక్క న్యూయార్క్​లోనే వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 965 కేసులు నమోదయ్యాయి.

అయితే.. పరిస్థితులు ఇంకా తీవ్రమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ తెలిపారు. 2 వారాల్లో కరోనా మరణాల రేటు మరితం తీవ్రమవుతుందని అంచనా వేశారు.

ఇతర దేశాల్లో పరిస్థితి ఇలా...

Coronavirus: China reports 4 deaths, 31 new cases
వివిధ దేశాల్లో

ఇటలీలో...

ఇటలీని కరోనా వైరస్​ కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేనంతగా ఇటలీలోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 10వేల మందికిపైగా వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ గడువు ఏప్రిల్​ 3తో ముగియనుంది. పరిస్థితులు అదుపులోకి రానందున లాక్​డౌన్​ను పొడిగించడం అనివార్యమని ఇటలీ ప్రధాని గుసెప్పె కాంటె ప్రకటించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు తలెత్తినా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు.

బ్రెజిల్​ అధ్యక్షుడి ట్వీట్​ తొలగింపు...

వైరస్​ కట్టడిలో క్వారంటైన్​ పాత్రను ప్రశ్నిస్తూ బ్రెజిల్​ అధ్యక్షుడు బొల్సనారో రెండు ట్వీట్స్​ చేశారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ.. ట్విట్టర్​ ఆ ట్వీట్లను తొలగించింది.

ఇదీ చూడండి:- కరోనా గురించి మీరు విన్న వాటిలో ఏది నిజం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.