కరోనా వల్ల ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటివరకు 2 కోట్ల 73 లక్షల 34 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. మొత్తం 8,93,712 మంది ప్రాణాలు కోల్పోయారు. కోటి 94 లక్షల 10 వేల మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు.
కొవిడ్ కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో రోజూ 40 నుంచి 45 వేల కేసులు నమోదవుతున్నాయి. భారత్లో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది.
- నేపాల్లో కొత్తగా 979 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 47 వేలు దాటింది.
- పాక్లో కరోనా ఉద్ధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఈ నెల 15 నుంచి దశలవారీగా పాఠశాలలు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఒక్కరోజే ఆ దేశంలో 394 కేసులు నమోదవగా... మరో ముగ్గురు మృతి చెందారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 119 కేసులు బయటపడ్డాయి. మూడు వారాల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యల్పమని అధికారులు పేర్కొన్నారు.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 64,64,053 | 1,93,266 |
భారత్ | 42,24,014 | 71,844 |
బ్రెజిల్ | 41,37,606 | 1,26,686 |
రష్యా | 10,30,690 | 17,871 |
పెరు | 6,89,977 | 29,838 |
ఇదీ చూడండి: 2020 చివరికి ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా!