పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు కరోనా సాకుతో స్వేచ్ఛను ప్రసాదించింది అక్కడి ప్రభుత్వం. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకుతుందని కారణం చూపుతూ అనేక మంది ముష్కరులను ఇళ్లకు పంపించివేసింది. వీరిలో ప్రమాదకర లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. లాహోర్ జైలులోని 50 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు గత నెలలో తెలిపారు పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
పాక్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి నుంచి తొలగించాలంటే ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) తేల్చి చెప్పిన నేపథ్యంలో గత కొన్ని నెలల్లో ఇనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. ప్రపంచ దేశాలన్ని ఇప్పుడు కరోనా మహమ్మారిపై పోరు చేస్తుంటే ఇదే అదనుగా పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు విముక్తి కల్పించింది. ఇప్పుడు వారంతా యథేచ్ఛగా తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగిస్తున్నారు.
పాక్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించాలా? వద్దా? అనే విషయంపై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించనుంది ఎఫ్ఏటీఎఫ్. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్న 1000మందిని పాక్ ప్రభుత్వం అధికారిక జాబితా నుంచి కావాలనే తొలగించినట్లు న్యూయార్క్‌కు చెందిన డబ్ల్యూజేఎస్ సంస్థ తెలిపింది.
కశ్మీర్లోకి చొరబాట్లు...
ప్రపంచం దృష్టి కరోనా మీద ఉంటే పాక్ మాత్రం కశ్మీర్లోకి ఉగ్రవాదులను ఉసిగొల్పే పనిలో నిమగ్నమైంది. ఆ దేశంలో కరోనా ఉద్ధృతి ఉన్నా ఏ మాత్రం లెక్క చేయకుండా కశ్మీర్ సరిహద్దులో వరుస కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోంది. మోర్టార్ షెల్స్‌తో సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. జవాన్లు, సాధారణ పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. కరోనా రోగులను కశ్మీర్లోకి పంపి వైరస్ వ్యాప్తిని పెంచాలనీ.. పాక్ దురాలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.