ETV Bharat / international

జ్వరం, దగ్గు లేకపోయినా కరోనా ఉండొచ్చు!

కరోనా లక్షణాల్లో ప్రధానమైనవి దగ్గు, జ్వరం. ఈ లక్షణాలున్న వారిని ఇతరులతో కలవకుండా విడిగా ఉంచితే వైరస్‌ వ్యాపించకుండా ఆపొచ్చని ఇప్పటిదాకా అనుకుంటున్నాం. కానీ, కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవచ్చని.. అలాంటి వారితో వైరస్​ వ్యాప్తి మరింత పెరగనుందంటున్నారు చైనా శాస్త్రవేత్తలు.

CORONA WITHOUT SYMPTOMS
జ్వరం, దగ్గు లేకపోయినా కరోనా ఉండొచ్చు!
author img

By

Published : May 20, 2020, 7:07 AM IST

జ్వరం, దగ్గు వంటి లక్షణాలు లేనివారూ వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశాలు ఎక్కువని చైనా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. అమెరికా సీడీసీకి చెందిన ఎమర్జింగ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డీసీజెస్‌ పత్రికలో ప్రచురితమైన వ్యాసం ఈ ఆందోళనకర విషయాన్ని బయటపెట్టింది. ఇటీవల విదేశాల నుంచి చైనాకు తిరిగొచ్చిన ఇద్దరు విద్యార్థులను ముందు జాగ్రత్తగా ఓ హోటల్‌కు తరలించి, వేర్వేరు గదుల్లో ఉంచారు. వారిలో దగ్గు, జ్వరం వంటి లక్షణాలు మచ్చుకైనా లేవు.

అయితే రెండో రోజున చేసిన పరీక్షలో ఆ విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకినట్టు బయటపడింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఎందుకైనా మంచిదని పరిశోధకులు ఆ విద్యార్థులు బస చేసిన హోటల్‌ గదిని పరిశీలించారు. తలుపు గడియలు, స్విచ్చులు, థర్మామీటర్లు, టెలివిజన్‌ రిమోట్లు, దిండు కవర్లు, దుప్పట్లు, కొళాయిలు, టాయిలెట్‌ సీట్లు, ఫ్లషింగ్‌ భాగాల మీద.. ఇలా మొత్తం 22 చోట్ల నుంచి నమూనాలు తీసుకొని, పరీక్షించారు. వీటిల్లో 8 వస్తువుల మీద కరోనా వైరస్‌ ఉన్నట్టు తేలటం గమనార్హం.

లక్షణాలు స్పష్టంగా లేనివారి నుంచీ కొవిడ్‌-19 కారక సార్స్‌ సీవోవీ-2 ఆర్‌ఎన్‌ఏ చుట్టుపక్కల పరిసరాల్లో చాలా వేగంగా వ్యాపిస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎక్కువసేపు వాడుకున్న దుప్పట్లు, దిండు కవర్లలోనైతే వైరస్‌ పెద్ద మొత్తంలో కనిపిస్తోందని.. వీటిని మార్చేటప్పుడు, ఉతికేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని వివరిస్తున్నారు. లక్షణాలు కనిపించని వారి నుంచీ వైరస్‌ పెద్ద మొత్తంలో బయటకు వస్తుండటం, చుట్టుపక్కల పరిసరాల్లో వేగంగా వ్యాపిస్తుండటం నిజంగా కలవరపరచే విషయమే!!.

ఇదీ చదవండి:ఆశయానికి గజ్జెకట్టి.. అంగవైకల్యాన్ని తిప్పికొట్టిన యక్ష'గనుడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.