ETV Bharat / international

సార్స్​ కంటే కరోనా అత్యంత ప్రమాదకరం!

కరోనా మహమ్మారి సార్స్-కొవ్​ కంటే మరింత ప్రమాదకరమని హాంకాంగ్​ పరిశోధకులు తేల్చారు. రెండు వ్యాధుల లక్షణాలు పోల్చి చూసి వైరస్‌ల వల్ల మనిషి శ్వాస మార్గం, కళ్ల కణజాలాల్లో వచ్చే మార్పులను ప్రత్యేక ప్రయోగశాలలో పరీక్షించారు.

author img

By

Published : May 10, 2020, 7:21 AM IST

corona more dangerous than sars
సార్స్​ కంటే కరోనా అత్యంత ప్రమాదకరం!

గతంలో వ్యాపించిన సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(సార్స్‌-కొవ్‌) కంటే... ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్‌ మరింత ప్రమాదకరమని నిపుణులు తేల్చారు. హాంకాంగ్‌ యూనివర్సిటీకి చెందిన వైద్య విభాగం ఆచార్యులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మైఖేల్‌ చాన్‌ చీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం... కరోనా, సార్స్‌ల లక్షణాలు, ప్రభావాలు, వ్యాప్తి తదితరాలను పోల్చి చూసింది. వైరస్‌ల వల్ల మనిషి శ్వాస మార్గం, కళ్ల కణజాలాల్లో వచ్చే మార్పులను ప్రత్యేక ప్రయోగశాలలో పరీక్షించారు. సార్స్‌తో పోల్చినప్పుడు... మనిషి కంటిపొర, శ్వాసమార్గంలో కరోనా మరింత ప్రమాదకర ప్రభావాన్ని చూపిస్తోందని వెల్లడైంది. వైరస్‌లు మనిషి శరీరంలో చేరేందుకు కళ్లనే ప్రధాన మార్గంగా ఎంచుకుంటున్నాయని పరిశోధకులు నొక్కిచెప్పారు. కరోనా, సార్స్‌... మనిషిలో చూపే లక్షణాలు దగ్గరగానే ఉన్నప్పటికీ చిన్నచిన్న తేడాలను గమనించవచ్చు.
* సార్స్‌ కంటే కరోనా చాలా సులభంగా వ్యాపించగలదు. మనిషి ముక్కు, గొంతులో పెద్దమొత్తంలో కరోనా వైరస్‌ పోగయ్యాక అనారోగ్య లక్షణాలు బయటపడటం మొదలవుతాయి. దీని వల్ల వైరస్‌ సోకిందనే విషయం తెలియక ముందే ఇతరులకు ఇది వ్యాపిస్తోంది. లక్షణాలు బయట పడకముందే... శరీరం తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. అదే సార్స్‌ విషయంలో అనారోగ్య లక్షణాలు బయటపడ్డాక శరీరంలో వైరస్‌ పెరగడం మొదలవుతుంది.

కరోనా లక్షణాలు: జ్వరం, దగ్గు, అలసట, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, ముక్కు దిబ్బుడ, తలపోటు, కండరాల నొప్పులు, గొంతులో మంట, వికారం, అతిసారం, చలిపుట్టడం, వణుకుతో కూడిన చలి, రుచి తెలియక పోవడం, వాసనను గ్రహించ లేకపోవడం.

సార్స్‌ లక్షణాలు: జ్వరం దగ్గు, ఒళ్లంతా పోటు, ఒళ్లు నొప్పులు, తలపోటు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, అతిసారం, చలిపుట్టడం.

తీవ్రత ఇలా...

  • కరోనా సోకిన 20 శాతం మందికే ఆసుపత్రిలో వైద్య సేవల అవసరం ఏర్పడుతుంది. అతి కొద్దిశాతం మందికి వెంటిలేటర్లపై చికిత్స తప్పకపోవచ్చు.
  • సాధారణంగా సార్స్‌ సోకితే చాలా ప్రమాదకరం. 20 నుంచి 30 శాతం మందికి వెంటిలేటర్లపై చికిత్స చేయాల్సి వస్తుంది.
  • కరోనా మరణాలు దేశం దేశానికీ మారుతుంటాయి. ప్రదేశం, స్థానిక జనాభా లక్షణాలపై మరణాల శాతం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత కరోనా మరణాలు 0.25 నుంచి 3 శాతం మధ్యలో సంభవిస్తున్నాయి.
  • మరణాల పరంగా కరోనా కంటే సార్స్‌ ప్రమాదకారి. ఆ వైరస్‌ ద్వారా సంభవించిన మరణాలు 10 శాతం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.