ప్రపంచంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 22వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1039మంది ప్రాణాలు కోల్పోయారు. 57వేల 5వందల మంది పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలో..
వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న అమెరికాలో కొత్తగా 1772 మంది మహమ్మారి బారినపడ్డారు. 8 లక్షల 14వేల యాక్టివ్ కేసులున్నాయి. 15వేలమంది పరిస్థితి విషమంగా ఉంది. న్యూయార్క్ నగరంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
స్పెయిన్‌లో ఒక్కరోజే 331 మరణాలు..
స్పెయిన్‌లో కరోనా మరణాలు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 331 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అక్కడ మొత్తం మృతుల సంఖ్య 23,500కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 2 లక్షల 19 వేలకు పైగా మహమ్మారి బారినపడ్డారు.
సింగపూర్‌లో 14 వేలమందికి..
సింగపూర్‌లో సోమవారం మరో 799 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 14,423 కేసులు నమోదయ్యాయి. మొత్తం 12 మంది మృతి చెందారు.
పాక్‌లో 281 మంది మృతి...
పొరుగు దేశమైన పాక్‌లో తాజాగా మరో 12 మంది మరణించారు. మొత్తంగా 281 మంది వైరస్ కారణంగా అసువులు బాశారు. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 13,328కు పెరిగింది.
థాయ్‌లాండ్‌లో ఆరువారాల కనిష్ఠానికి..
థాయ్‌లాండ్‌లో నూతనంగా 9 కేసులు మాత్రమే నమోదైనట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. ఆరు వారాల్లో నమోదైన వైరస్ కేసుల్లో ఇదే అత్యల్పమని వెల్లడించారు. అక్కడ మొత్తంగా 2,931 మందికి వైరస్ సోకగా.. 52 మంది కరోనా కారణంగా మరణించారు.
రష్యాలో పెరుగుతున్న కేసులు..
రష్యాలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 6 వేలమందికి వైరస్ సోకింది. 47 మంది కన్నుమూశారు. మొత్తంగా బాధితుల సంఖ్య 87,147 మందికి చేరింది. 794 మంది ఇప్పటివరకు మృతి చెందారు. రష్యా సైన్యంలో 874 మందికి వైరస్ సోకింది.
ఇరాన్లో..
ఇరాన్లో నేడు మరో 991 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 96 మంది మరణించారు. దేశంలో 91,472 మందికి కొవిడ్-19 సోకగా.. 5,806 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశాల వారీగా...
బెల్జియంలో వైరస్ కేసుల సంఖ్య 46,687కు పెరిగింది. 7,207 మంది మృతి చెందారు. నెదర్లాండ్స్‌లో 24 గంటల్లో 400 మందికి పాజిటివ్‌గా తేలగా మొత్తం కేసుల సంఖ్య 38,345కు చేరింది. జర్మనీలో కరోనా కేసులు లక్షా 58వేలకు చేరువయ్యాయి. బ్రెజిల్లో 63,328 మందికి వైరస్ బాధితుల సంఖ్య చేరింది.