ETV Bharat / international

క్వాడ్ సదస్సుపై తీవ్రంగా స్పందించిన చైనా - చైనా

దేశాల మధ్య సమావేశాలు మూడో పక్షానికి నష్టం చేకూర్చరాదని అన్నారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియన్. పరస్పర సహకారం, సంబంధాల బలోపేతం కోసమే వాటిని నిర్వహించాలని క్వాడ్​ సదస్సును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Cooperation between countries should not target third party: China on Quad summit
'మూడో పక్షం లక్ష్యంగా దేశాల మధ్య సహకారం సరికాదు'
author img

By

Published : Mar 12, 2021, 6:01 PM IST

దేశాల మధ్య చర్చలు మూడో పక్ష ప్రయోజనాలు దెబ్బతీసే ఉద్దేశంతో జరగరాదని అన్నారు చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్. ప్రతిగా పరస్పర అవగాహన పెంపునకు జరగాలని చెప్పారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా (క్వాడ్) కూటమి శుక్రవారం వర్చువల్​గా సమావేశం కానున్న నేపథ్యంలో లిజియన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"దేశాల మధ్య చర్చలు, సహకారం.. మూడో వ్యక్తుల(దేశాల) ఆశయాలను దెబ్బతీయడానికి కాక పరస్పర అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు జరగాలి. ఒక దేశాన్ని నష్ట పరిచేందుకు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేయరాదు. సంబంధిత దేశాలు(క్వాడ్).. పారదర్శకత, సమ్మిళిత, ఇరువురికీ లాభం అనే సూత్రాలను పాటిస్తాయని విశ్వసిస్తున్నాం. శాంతి, సుస్థిరత, అభివృద్ధి సాధన కోసం చర్చలు జరగాలి."

- ఝావో లిజియన్, చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి

క్వాడ్​ సదస్సులో ఇండో పసిఫిక్​ ప్రాంతంలో చైనా దూకుడు, ఆ దేశ సైనిక, ఆర్థిక శక్తి దుర్వినియోగాన్ని కట్టడి చేసే అంశంపైనా దేశాధినేతలు చర్చించే అవకాశం ఉంది. ఇందుకోసం వ్యూహాత్మక ఒప్పందాలు కుదురుతాయని తెలుస్తోంది.

ఇదీ చూడండి: విస్తరించనున్న చతురస్రం- చైనాను ఎదుర్కొనే వ్యూహమదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.