ETV Bharat / international

నేడు బంగ్లాదేశ్​కు మోదీ.. రెండు రోజుల​ పర్యటన - బంగ్లాదేశ్​లో మోదీ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేటి నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్​లో పర్యటించనున్నారు. బంగ్లాదేశ్​ జాతీయ దినోత్సవ వేడుకలు, బంగబంధు షేక్​ ముజిబీర్​ రెహ్మాన్ శత జయంతి​ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత విదేశీ పర్యటనకు ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. మోదీ పర్యటనలో భాగంగా.. బంగ్లాదేశ్​తో వాణిజ్యం, అనుసంధానత తదితర అంశాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది.

Connectivity, commerce to figure prominently during Hasina-Modi summit
అనుసంధానతే లక్ష్యంగా బంగ్లాదేశ్లో​ మోదీ పర్యటన!
author img

By

Published : Mar 26, 2021, 5:05 AM IST

బంగ్లాదేశ్​లో రెండు రోజు పర్యటనకు నేడు బయలుదేరి వెళ్లనున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల అనుసంధానం, వాణిజ్యం, నదుల నిర్వహణ, భద్రత, సరిహద్దులకు సంబంధించి పలు కీలక విషయాలను బంగ్లా ప్రధాని షేక్​ హసీనాతో మోదీ చర్చిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత విదేశీ పర్యటనకు ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి కావడం వల్ల ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్​లోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. మోదీకి ఆ దేశ​ ప్రధాని షేక్​ హసీనా స్వాగతం పలుకుతారని చెప్పాయి. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ వేడుకలు, బంగబంధు షేక్ ముజిబుర్‌ రెహ్మాన్‌ శత జయంతి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు.

తొలిరోజు పర్యటన ఇలా..

1971 నాటి బంగ్లా​ స్వతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన అమరులుకు సావర్​లోని జాతీయ స్మారకం వద్ద మోదీ నివాళులు అర్పించనున్నారు. అనంతరం బంగబంధు షేక్ ముజిబుర్‌ రెహ్మాన్‌ శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆ దేశ ప్రధాని హసీనాతో కలిసి బంగబంధు-బాపు మ్యూజియాన్ని మోదీ ప్రారంభిస్తారు. బంగ్లాదేశ్​లోని వివిధ వ్యక్తులతోనూ మోదీ ముచ్చటిస్తారు.

రెండో రోజు..

మోదీ పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్​లోని రెండు హిందూ ఆలయాలకు అక్కడి ప్రభుత్వం సరికొత్తగా తీర్చిదిద్దింది. శత్​ఖిరా, గోపాల్​గంజ్​లోని జేశోరేశ్వరి, ఓర్కాండీ దేవాలయాల్లో మోదీ శనివారం పూజలు నిర్వహించనున్నారు.

మోదీ హర్షం..

సాంస్కృతిక బంధమున్న బంగ్లాదేశ్‌కు వెళ్తుండటంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు.

"ప్రధానమంత్రి షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ ఆర్థిక, అభివృద్ధి పురోగతిని ప్రశంసించడానికి మాత్రమే కాదు, ఈ విజయాల్లో భారత్​ నిరంతర మద్దతు ఉంటుందని తెలిపేందుకే నా పర్యటన. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఎంతో గాఢమైన సాంస్కృతిక, భాషా సంబంధాలు ఉన్నాయి"

- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

ఇదే సమయం..

ప్రధాని మోదీ బంగ్లాదేశ్​ పర్యటన సందర్భంగా.. పలు కీలక అంశాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చకుంటారని అంతకుముందు.. విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. పలు ప్రాంతాల్లో సహకారానికి సంబంధించి కీలక ప్రకటనలు చేస్తారని చెప్పారు.

"ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది. బంగ్లాదేశ్​తో వ్యుహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవండంలో కీలకంగా ఉపకరిస్తుంది."

-హర్షవర్ధన్​ ష్రింగ్లా, విదేశాంగ కార్యదర్శి.

భారత్​ అనుసరిస్తున్న పొరుగుదేశాలకు ప్రాధాన్యం, యాక్ట్​ ఈస్ట్​ పాలసీలో బంగ్లాకు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇదే కీలక సమయమన్నారు.

భారత్​తో మళ్లీ అనుబంధం కోసం..

బంగ్లాదేశ్​లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. భారత్​తో తిరిగి తమ అనుబంధాన్ని పెంచుకోవడం కోసం అక్కడి స్వతంత్ర సమరయోధులు ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్​లోని యైమెన్సింగ్​ జిల్లా షెర్​పుర్​ పట్టణానికి చెందిన విద్యార్థి సుభాష్​ చంద్ర బాదల్​.. అలాంటి వారిలో ఒకరు. 1971లో పాకిస్థాన్​ సైన్యం దాడుల సమయంలో మేఘాలయలోని ముక్తి వాహిని స్వతంత్ర సమరయోధుల సంఘంలో ఆయన చేరారు. అనంతరం బంగ్లాదేశ్​కు తిరిగివచ్చి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. బాదల్​ లాంటి ఎంతో మంది ఇప్పుడు.. మోదీ పర్యటన సందర్భంగా మళ్లీ భారత్​తో తమ అనుబంధాన్ని పెంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు.

ఇదీ చూడండి:రెండు రోజుల పాటు బంగ్లాదేశ్​లో మోదీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.