కరోనా ఆంక్షల కారణంగా చైనాలో అడుగుపెట్టలేని వేలాదిమంది భారతీయ విద్యార్థుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
దాదాపు 4 లక్షల 40 వేల మంది విదేశీ విద్యార్థులు చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు.
భారత్ నుంచే దాదాపు 23 వేల మందికిపైగా అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఎక్కువమంది వైద్యవిద్యార్థులే. వీరంతా కొవిడ్ కారణంగా భారత్‌కు తిరిగి వెళ్లారు. అప్పటినుంచి ఆన్లైన్లోనే విద్యాబోధన జరుపుతున్నారు. చైనా కూడా వీరిని తమ దేశానికి అప్పుడే రావొద్దని అంటోంది. తమ దేశంలో కొవిడ్-19 ఆంక్షలు ఇంకా అమల్లో ఉన్నాయని, ఆన్లైన్లోని విద్యను కొనసాగించాలని కోరుతోంది.
తమకు ఉపకార వేతనాలు ఇవ్వట్లేదని విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత విద్యార్థుల సమస్యలను చైనా విద్యాధికారుల దృష్టికి తీసుకొస్తున్నామని తెలిపింది.
ఇదీ చూడండి: ''భారతీయ విద్యార్థులకు చైనా టీకా'పై పరిశీలిస్తాం'