ETV Bharat / international

చైనాలో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం- పోలీసులపై దాడి - చైనాలోని హుబే రాష్ట్రంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.

చైనాలోని హుబే రాష్ట్రంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. లాక్​డౌన్​ ఎత్తివేసినా పొరుగు రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతించని పోలీసులపై ప్రజలు దాడికి దిగారు. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. చివరకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాయి.

Clashes erupt in China as people try to leave coronavirus-hit Hubei
చైనాలో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం- పోలీసులపై దాడి
author img

By

Published : Mar 29, 2020, 11:21 AM IST

చైనాలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. కరోనా వైరస్​కు పుట్టినిల్లు అయిన హుబే రాష్ట్రంలో పౌరులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అసలు ఏమైంది?

కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా జనవరి 23 నుంచి హుబే రాష్ట్రంలో లాక్​డౌన్​ అమల్లో ఉంది. వైరస్​ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇటీవల ఆంక్షలు ఎత్తివేశారు. అనేక రోజులుగా హుబేకే పరిమితం అయిన ప్రజలు... ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పొరుగున ఉన్న జియాంగ్​షీ రాష్ట్రానికి అనేక మంది ప్రయాణమయ్యారు. అయితే రెండు రాష్ట్రాల్ని కలిపే వంతెనపై జియాంగ్​షీ రాష్ట్ర పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. ఇతరుల తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు.

అడ్డగింతతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు... జియాంగ్​షీ పోలీసులతో ఘర్షణ పడ్డారు. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. ఓ దశలో హుబే, జియాంగ్​షీ రాష్ట్రాల పోలీసులు కూడా పరస్పరం ఘర్షణ పడ్డారు. జియాంగ్​షీలోకి ఎవరిని పంపించాలి? అనుమతి పత్రాలు ఎవరు సరిచూడాలన్న అంశంపై వాగ్వాదానికి దిగారు. ఈ దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరస్​ అయ్యాయి.

కాసేపటి తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. బారికేడ్లు తొలగించి, ప్రజలు వెళ్లేందుకు అనుతిస్తున్నట్లు స్పష్టంచేశాయి.

ఇదీ చూడండి : ఈ ఏడాది 'ఎర్త్​ అవర్​' పాటించింది ఆ ఒక్క దేశమే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.