ETV Bharat / international

చాక్లెట్ బిర్యానీ.. ఇదేం టేస్ట్​రా బాబూ?!

బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు కడుపు ఫుల్లుగా ఉన్నా సరే మళ్లీ ఆరగించడానికి తయారైపోతాం. దాదాపు భోజన ప్రియులందరికీ ఫేవరేట్​ అయిన బిర్యానీ సరిగా కుదరకపోతే తిన్నట్టే అనిపించదు. ఇక దీనిలో వేరే ఏ పదార్థమూ కలుపుకొని తినాలనిపించదు. కానీ ఓ వ్యక్తి బిర్యానీలో ఏకంగా చాక్లెట్ కలుపుకుని తింటున్నాడు.! అవును.. మీరు విన్నది నిజమే.. 'చాక్లెట్ బిర్యానీ' తింటూ ఓ వ్యక్తి అప్​లోడ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది..

chocolate biryani
చాక్లెట్ బిర్యానీ
author img

By

Published : Jul 30, 2021, 2:29 PM IST

ఫ్రెండ్స్​తో కలసి రెస్టారెంట్​కు వెళ్లి వేడివేడి బిర్యానీ ఆర్డరిచ్చారు. చాక్లెట్ సాస్‌ కలిపిన బిర్యానీ మీకు ఇస్తే? మరో ఆలోచన లేకుండా వద్దని చెప్పేస్తారు కదూ. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆనందంగా ఆరగించాడు. అంతేగాక దీనిని యూట్యూబ్​లో పోస్ట్ చేశాడు. పాకిస్థాన్​లోని ఓ బిర్యానీ పాయింట్​ ఈ డెడ్లీ కాంబినేషన్​తో బిర్యానీ అందిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ సంగతి!

ఇటీవల కరాచీలోని ఒక హోటల్​లో ఓ వ్యక్తి ఆర్డర్ మేరకు బిర్యానీ తీసుకొచ్చిన సిబ్బంది.. దానిపై చాక్లెట్ సాస్ పోసి వడ్డించాడు. దీనిని రుచి చూసిన ఆ వ్యక్తి ఆనందం వ్యక్తం చేశాడు. చాలా బాగుంది అంటూ సిబ్బందిని మెచ్చుకున్నాడు. అంతేకాదు 'దీన్ని తయారుచేసిన చెఫ్ చేతులను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నా' అని అన్నాడు. ఈ మేరకు ఓ వీడియోను యూట్యూబ్​లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన బిర్యానీ ప్రేమికులు మాత్రం విసుగు, కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

chocolate biryani
చాక్లెట్ బిర్యానీ
chocolate biryani
చాక్లెట్ బిర్యానీ తింటున్న వ్యక్తి

ట్రోల్.. కామెంట్లు..

'చాక్లెట్ బిర్యానీ' వీడియో సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తోంది. దీనిపై నెటిజన్లు, బిర్యానీ ప్రేమికులు ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ఘోరంరా బాబు అంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు. బిర్యానీ తింటున్న వ్యక్తి నటనకు ఆస్కార్ అవార్డు పక్కా అని ఒకరు అన్నారు. 'క్యా బాత్ హై' అంటూ మరొకరు కామెంట్ చేయగా.. అత్యంత చెత్త వంటకం అని ఇంకో యూజర్ ఫైర్ అయ్యాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.