ETV Bharat / international

అంగారకుని కక్ష్యలో చైనా వ్యోమనౌక

అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా అంగారకునిపై చైనా పంపిన వ్యోమనౌక కక్ష్యలోకి ప్రవేశించింది. ఏడు నెలల పాటు ప్రయాణించిన ఈ వ్యోమనౌక.. అంగారక గ్రహంలో భూగర్భ జలాలు, ప్రాచీన నాగరికత అవశేషాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై అధ్యయనం చేస్తుంది.

Chinese spacecraft nearing Mars, world second in 2 days
అంగారకుని కక్ష్యలో చైనా వ్యోమనౌక
author img

By

Published : Feb 11, 2021, 9:32 AM IST

అంగారకుని పైకి చైనా ప్రయోగించిన తియాన్​వెన్​-1 వ్యోమనౌక బుధవారం ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొన్ని నెలల తరువాత వ్యోమనౌకలోని ఆర్బిటర్​ నుంచి రోవర్​ విడిపోయి కిందికి దిగుతుంది. అంగారక గ్రహంలో భూగర్భ జలాలు ఉన్నాయా? ప్రాచీన నాగరికత ఏమైనా ఉందా? అనే విషయాలపై అధ్యయనం చేస్తుంది. ఏడు నెలల పాటు ప్రయాణించి కక్ష్యలోకి చేరుకుంది.

యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ ప్రయోగించిన మరో వ్యోమనౌక 'అమల్​' మంగళవారమే కక్ష్యలోకి ప్రవేశించింది. అమెరికా ప్రయోగించిన పెర్​సర్వన్స్​ వ్యోమనౌకలోని రోవర్​ వచ్చే వారం అంగారకుని భూతలంపై దిగనుంది. ఈ మూడింటిని గత ఏడాది జూలైలో ప్రయోగించడం గమనార్హం. ఇప్పటికే ఆరో వ్యోమనౌకలు అంగారకుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇందులో మూడు అమెరికావి, రెండు ఐరోపావి, ఒకటి భారత దేశానికి చెందినది.

ఇదీ చూడండి: అంగారక కక్ష్యలోకి చేరిన యూఏఈ వ్యోమనౌక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.