చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత తేలికైన క్వాంటమ్ కంప్యూటర్ను రూపొందించారు. సూపర్ కంప్యూటర్లు సైతం వేల సంవత్సరాలు చేసే పనిని ఈ కంప్యూటర్ సెకండ్స్లో చేయగలదని తెలిపారు. ఇది 'అతిపెద్ద విజయం 'గా అభివర్ణించారు. కంప్యూటర్ రంగంలోనే ఇది మైలురాయిగా శాస్త్రవేత్తలు తెలిపారు. క్వాంటమ్ కంప్యూటర్‌కు 'జియూఝాంగ్'గా నామకరణం చేశారు. క్వాంటమ్ కంప్యూటర్ చేసే పని.. సంప్రదాయ కంప్యూటర్లకు సాధ్యం కాదని వివరించారు. మెటీరియల్ సైన్స్, కృత్రిమ మేధ, మెడిసిన్ రంగాల్లో ఈ కంప్యూటర్ను వినియోగించవచ్చని తెలిపారు.
జియూఝాంగ్ ఈ పేరు చైనాకు చెందిన గణిత శాస్త్రం లోనిది. 'గాసియన్ బోసన్' అనే సంక్లిష్టమైన లెక్కను చేయటానికి ఈ కంప్యూటర్‌కు కేవలం 200 సెకండ్స్ పట్టింది. అదే ఫుగాకు (ప్రపంచంలోనే వేగవంతమైన క్లాసికల్ సూపర్ కంప్యూటర్)కు ఈ ప్రశ్న చేయటానికి 6 వందల మిలియన్ సంవత్సరాలు పడుతుంది. గూగుల్ సంస్థ తయారు చేసిన 53-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ తరువాత.. గాసియన్ బోసన్ ప్రశ్నను సెకండ్స్లో చేసిన రెండో కంప్యూటర్‌గా నిలిచింది.
చైనా ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్‌పై భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2017లో చైనా క్వాంటమ్ సమాచార ఉపగ్రహాన్ని రూపొందించింది. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ హ్యాకింగ్‌కు గురి కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంది చైనా ప్రభుత్వం.
ఇదీ చదవండి : 'ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్'లో పూనావాలాకు చోటు