కరోనాను సమర్థవంతంగా నియంత్రించే వాక్సిన్ను తాము రూపొందిస్తున్నట్లు చైనాకు చెందిన సినోవాక్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 99 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోందని వారు చెబుతున్నారు.
"బీజింగ్‌కు చెందిన బయోటెక్ సంస్థ సినోవాక్ ఈ కరోనా టీకాను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఇది 1000 మంది కరోనా రోగులపై రెండోసారి క్లినికల్ ట్రయల్స్ చేస్తోంది. మిగతా మూడు ట్రయల్స్‌ను యూకేలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది."
- యూకే బ్రాడ్‌కాస్టర్ స్కై న్యూస్
10 కోట్ల డోసులు
'తమ కరోనా వ్యాక్సిన్‌కు కనుక ఆమోదం లభిస్తే.. వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి సినోవాక్ సన్నద్ధమవుతోంది. అందుకోసం బీజింగ్‌లోనే మరో ప్రదేశంలో కర్మాగారాన్ని నిర్మిస్తోంది. ఒకే సారి 10 కోట్ల డోసుల ఔషధం తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది' అని స్కై న్యూస్ పేర్కొంది.
ముందుగా.. వృద్ధులకు
"మేము అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఇదే. ఇది త్రీఫిల్ సిరంజి. దీనిని ఉపయోగించడం చాలా సులువు. ఈ టీకాను ప్రజలందరికీ పంపిణీ చేసేందుకు సిద్ధంగా లేము. ముందుగా తీవ్ర ముప్పు ఉన్న రోగులకు, ఇంటి పని చేసేవారికి, వృద్ధులకు అందించాలని భావిస్తున్నాం."
- హెలెన్ యాంగ్, సీనియర్ డాక్టర్, సినోవాక్
ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత ట్రయల్స్ సాఫీగా సాగుతున్నప్పటికీ.. ఔషధ నియంత్రణ సంస్థల ఆమోదం పొంది మూడో దశ ట్రయల్స్‌కు చేరుకోవడానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 'దేశంలో రిమెడిసివిర్ విక్రయాలకు అనుమతివ్వండి'