ETV Bharat / international

సాయుధ దళాల ఆధునికీకరణకు జిన్​పింగ్ ఆదేశం - జి జిన్​పింగ్

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆధునికీకరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా సాయుధ దళాల నిర్వహణ పద్ధతులను, శిక్షణ నైపుణ్యాలు మరింత మెరుగుపరచాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అమెరికా, భారత్​తో ఘర్షణ... దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో ప్రాదేశిక విబేధాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే జిన్​పింగ్ ఈ చర్యకు పూనుకుంటున్నారు.

Chinese President Xi asks PLA to improve strategic management of armed forces
సాయుధ దళాల ఆధునికీకరణకు జిన్​పింగ్ ఆదేశం
author img

By

Published : Jun 19, 2020, 5:30 AM IST

సాయుధ దళాల నిర్వహణ పద్ధతులను, శిక్షణ, నైపుణ్యాలను మరింత మెరుగుపరచాలని చైనా అధ్యక్షుడు జి జిన్​పింగ్.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్​ఏ)ని ఆదేశించారు. సైనిక దళాలకు స్వయంగా నాయకత్వం వహిస్తున్న జిన్​పింగ్... టెలికాన్ఫరెన్స్ ద్వారా సైన్యానికి ఈ కీలక సూచనలు చేశారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

అగ్రరాజ్యం అమెరికాతో విబేధాలు, తూర్పు లద్దాక్​లో భారత్​తో ఘర్షణ, వ్యూహాత్మక దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో ప్రాదేశిక వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో... జిన్​పింగ్ సైనిక ఆధునికీకరణపై దృష్టి కేంద్రీకరించారు.

యుద్ధోన్మాదం

దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి ఫలితాలపై దృష్టి సారించి.. సాయుధ దళాలను నవీకరించాలని, వ్యూహాత్మక వ్యవస్థలు, యంత్రాంగాల్ని మెరుగుపరచాలని 'పీఎల్​ఏ'ను జిన్​పింగ్ ఆదేశించారు. ఇందుకోసం 13వ పంచవర్ష ప్రణాళికను పూర్తిగా అమలు చేయాలని, అలాగే సైనిక అభివృద్ధి కోసం 14వ పంచవర్ష ప్రణాళికలోనూ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఈ ఏడాది చైనా 1.27 ట్రిలియన్ యువాన్ల(సుమారు 179 బిలియన్​ డాలర్లు) భారీ రక్షణ బడ్జెట్​ను ఆమోదించింది.​ గతేడాది ఈ రక్షణ బడ్జెట్ 177.61 బిలియన్లుగా ఉంది.

2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిన్​పింగ్ ... సైనిక దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానంగా దృష్టి సారించారు. రక్షణ దళాలను పునర్​వ్యవస్థీకరించారు. నౌకా, వాయు దళాల సామర్థ్యాన్ని బాగా పెంచారు.

ఇదీ చూడండి: గల్వాన్​ నదిపై ఆనకట్టా.. మాకు తెలియదే: చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.