ETV Bharat / international

అమెరికాకు చైనా రాజీ సంకేతాలు!

అమెరికా-చైనా మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి పరస్పర సహకారం అవసరమని చైనా వాణిజ్య శాఖ మంత్రి వాంగ్​ వెన్​టో అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 11 న ఇరుదేశాల అధ్యక్షులు ఫోన్​లో మాట్లాడుకున్నారని గుర్తుచేసిన వాంగ్​.. ఇరుదేశాల మధ్య మళ్లీ చర్చల ప్రారంభమవుతాయా? అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

author img

By

Published : Feb 24, 2021, 7:22 PM IST

Chinese official calls for 'joint efforts' in China-US trade
'చైనా-యూఎస్ వాణిజ్యానికి ఉమ్మడి ప్రయత్నం అవసరం'

వాణిజ్య బంధం పునరుద్ధరణే లక్ష్యంగా అమెరికాకు స్నేహహస్తం అందించే ప్రయత్నం చేసింది చైనా. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు​ ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అయితే... సుంకాల విషయంలో నిలిచిపోయిన చర్చలను తిరిగి ప్రారంభించడం, అమెరికాకు కొన్ని మినహాయింపులు ఇవ్వడంపై మాత్రం చైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

పరస్పర సహకారమే సరైన మార్గం. చైనా-అమెరికా మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఇంతకుముందు ఉన్న విధంగా పరస్పర సహకారంతో కొనసాగాలని ఆశిస్తున్నాను. చైనా వాణిజ్య పరిస్థితి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నందున అమ్మకాలను ప్రోత్సహించడానికి ఈ-కామర్స్​ సేవలను ప్రారంభించాము.

-వాంగ్​ వెన్​టో, చైనా వాణిజ్య మంత్రి

చైనాతో వ్యవహరించే తీరుపై ఎలాంటి వ్యూహాలను అమెరికా అనుసరించబోతోందో అగ్రరాజ్యం​ అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. కానీ చైనా విషయంలో డొనాల్డ్ ట్రంప్​ అనుసరించిన తీరునే బైడెన్ కొనసాగించనున్నారని నిపుణులు అనుకుంటున్నారు. చైనా దిగుమతులపై పన్ను భారం ఇంతకుముందు ఉన్న విధంగానే కొనసాగిస్తారని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:'చైనాతో యథాతథ సంబంధాలు కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.