బలగాల ఉపసంహరణలో ఇప్పుడున్న సానుకూల పరిస్థితులను చూసి భారత్ సంతోషించాలని వ్యాఖ్యానించింది చైనా. శనివారం ముగిసిన చర్చల్లో ఎలాంటి పురోగతి లభించని నేపథ్యంలో చైనా వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
"బలగాల ఉపసంహరణలో ప్రస్తుత సానుకూల పరిస్థితిని చూసి భారత్ సంతోషించాలి. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రస్తుత సానుకూల వైఖరినే కొనసాగించాలి. ఇరుదేశ సైన్యాల మధ్య జరిగిన ఒప్పందాలు, మునుపటి చర్చలకు కట్టుబడి ఉండాలి. చైనాలాగే భారత్ కూడా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పే దిశగా అడుగులు వేస్తుందని ఆశిస్తున్నాం."
- చైనా సైన్యం.
మిగిలిన ప్రాంత్లాల్లో బలగాల ఉపసంహరణపై ఇరుదేశాల మధ్య చుషుల్-మోల్దో సరిహద్దుల్లో 11వ దఫా కోర్కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ప్రతిపాదనపై చైనా సానుకూలంగా స్పందించలేదు. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తే విధంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
ఇదీ చూడండి: మా వ్యాక్సిన్ల సామర్థ్యం తక్కువే: చైనా