ప్రపంచంలోనే శక్తిమంతమైన సైనిక శక్తిగా ఎదుగుతున్న చైనా.. తన రక్షణ దళాలకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వారి జీతభత్యాలు 40 శాతం మేర పెరగనున్నట్లు సమాచారం. మరింత ఆధునిక, చురుకైన పోరాట శక్తిగా భద్రత బలగాలను తీర్చిదిద్దేందుకే జిన్‌పింగ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ విషయాన్ని పేర్కొంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) అధికారాలను పెంచేందుకు ఈ ఏడాది ప్రారంభంలోనే.. జాతీయ రక్షణ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది పాలక కమ్యూనిస్టు పార్టీ. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో.. 2027 నాటికి ప్రపంచంలోనే శక్తిమంతమైన సైనిక శక్తిగా ఎదగాలని చైనా ఆశపడుతోంది. ఈ క్రమంలోనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఈనెల 24న భారత్-చైనా కమాండర్ల 9వ దఫా భేటీ