వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని అమెరికాను చైనా (china vs america in south china sea) హెచ్చరించింది. అమెరికాకు చెందిన ఓ జలాంతర్గామి ఈ ప్రాంతంలో ప్రమాదానికి గురైన నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి దక్షిణ చైనా సముద్రంలో అమెరికా చర్యలపై తమకు అనుమానాలు కలిగాయని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వు ఖియాన్ తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాలకు ప్రధాన కారణం అమెరికా జోక్యం చేసుకోవడమేనని అన్నారు. ఇలాంటి చర్యలను అమెరికా నిలిపివేయాలని పేర్కొన్నారు.
అణుశక్తితో నడిచే ఈ సబ్మెరైన్ దక్షిణ చైనా సముద్రంలో ఇటీవల ఓ వస్తువును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది నావికులు గాయపడ్డారు. దీని తర్వాత ఇద్దరు సీనియర్ అధికారులను అమెరికా తొలగించింది.
దక్షిణ చైనా సముద్రం తమదేనని చైనా (china and us tensions in south china sea) కొన్నాళ్లుగా వాదిస్తోంది. ఈ ప్రాంతంలో ఎన్నో నూతన నిర్మాణాలను చేపట్టింది. ఈ క్రమంలో చైనాను అమెరికా విమర్శిస్తోంది. ఈ ప్రాంతంలో వైమానిక, నౌకాదళ గస్తీని అమెరికా కూడా తీవ్రతరం చేసింది.
ఇదీ చదవండి:Floating City: వరదను తట్టుకునేలా అలలపై అందాల నగరం!
ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా చెన్నుపాటి జగదీశ్