ETV Bharat / international

కరోనాపై పోరులో భారత్​కు మద్దతుగా నిలుస్తాం: చైనా

కరోనాపై మహమ్మారితో పోరాడుతున్న భారత్​కు శాయశక్తులా అండగా నిలుస్తామని ప్రకటించింది చైనా. త్వరలోనే కరోనాను భారత్​ జయిస్తుందని డ్రాగన్​ విదేశాంగ మంత్రి వాంగ్​ తెలిపారు. ఈ మేరకు సానుభూతిని ప్రకటిస్తూ.. లేఖ రాశారు.

India, china
భారత్​, చైనా
author img

By

Published : Apr 29, 2021, 3:56 PM IST

కొవిడ్​-19 పోరులో భారత్​కు అన్ని విధాల మద్దతుగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ తెలిపారు. కరోనా కట్టడికి చైనాలో తయారయ్యే వస్తువులు వేగంగా భారత్​కు చేరుస్తామన్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్​ జైశంకర్​కు లేఖ రాశారు వాంగ్​.

" కరోనాతో భారత్​ ఎదుర్కుంటున్న సవాళ్లకు చైనా సానుభూతి తెలుపుతోంది. మానవాళికి కరోనా వైరస్​ ఉమ్మడి శత్రువు. అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలవాల్సిన సమయం. వేగంగా స్పందించేందుకు సహకారం అవసరం. కరోనాతో పోరాడుతున్న భారత ప్రభుత్వం, ప్రజలకు చైనా మద్దతుగా ఉంటుంది. భారత ప్రభుత్వం నేతృత్వంలో ప్రజలు త్వరలోనే మహమ్మారిపై విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. "

- వాంగ్​ యీ, చైనా విదేశాంగ మంత్రి.

ఈ లేఖను జతచేస్తూ భారత్​లో చైనా రాయబారి సన్​ వేయ్​డాంగ్​ ట్వీట్​ చేశారు. తూర్పు లద్దాఖ్​లోని మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోని సమయంలో వాంగ్​ లేఖ రాయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: '80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.