నేపాల్ రాజకీయ సంక్షోభంపై ఆ దేశ నేతలతో చర్చలు జరుపుతున్న చైనా.. తాజాగా ప్రతిపక్ష నేతలతో మంతనాలు సాగిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ అధినేత ఫేర్ బహదూర్ దౌబాతో చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియన్ మంగళవారం భేటీ అయ్యారు. నేపాల్-చైనా దౌత్య సంబంధాలు.. ప్రస్తుత రాజకీయ అనిశ్చితిపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా దౌబాను వచ్చే ఏడాది జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా శతజయంతి వేడుకలకు ఆహ్వానించారు లిజియన్.
ఇప్పటికే జావో... నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవీ భాండారి, ప్రధాని ఓలీ సహా వివిధ నేతలతో భేటీ అయ్యారు.
ఇదీ చూడండి : 'నేపాల్లో రాజకీయ సంక్షోభానికి త్వరలోనే తెర'