ETV Bharat / international

ఐస్​క్రీంలో కరోనా వైరస్- కొన్నవారికోసం గాలింపు - కరోనా ఐస్​క్రీం వైరస్

చైనాలోని ఓ ఫాక్టరీలో తయారైన ఐస్​క్రీం​లో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో వేలకొద్దీ ఐస్​క్రీం బాక్సులను వెనక్కితీసుకుంటున్నారు. ఈ బ్యాచ్​లో ఉత్పత్తి అయిన వాటిలో 390 కార్టన్లు ఇప్పటికే విక్రయించారు. దీంతో ఈ ఐస్​క్రీం​లను కొన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

Chinese city reports coronavirus found on ice cream
ఐస్​క్రీంలో కరోనా వైరస్
author img

By

Published : Jan 17, 2021, 10:48 AM IST

చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ అక్కడ తయారైన ఐస్​క్రీం​లోనూ కరోనా ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆ బ్యాచ్​లో ఉత్పత్తి అయిన వేల ఐస్​క్రీం కార్టన్​లను వెనక్కి తీసుకుంటోంది సంస్థ. బీజింగ్​కు సమీపాన ఉన్న తియాన్జిన్​లోని డాకియావొడావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్​లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఈ బ్యాచ్​లో మొత్తం 29 వేల కార్టన్లు ఇంకా విక్రయించలేదని స్థానిక ప్రభుత్వాధికారులు తెలిపారు. 390 కార్టన్లు తియాన్జిన్​లో అమ్మినట్లు వెల్లడించారు. వీటి అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయో కనిపెట్టే పనిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

అయితే ఐస్​క్రీంల వల్ల ఎవరైనా కరోనా బారినపడ్డారో లేదో తెలియలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంస్థను సీజ్​ చేసి, అందులోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు, చైనాలో ఆదివారం 109 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో 72 కేసులు హెబే ప్రావిన్స్​లోనే వెలుగుచూశాయి. ఇక్కడే చైనా ప్రభుత్వం భారీ ఐసోలేషన్ ఆస్పత్రిని నిర్మిస్తోంది. దేశంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.

ఇదీ చదవండి: ఐదు రోజుల్లోనే 6500 గదుల ఆసుపత్రి నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.