చైనాలోని వుహాన్ నగరంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ పరీక్షలను విస్తృతం చేసింది అక్కడి యంత్రాంగం. నగరంలోని 1.1 కోట్ల మంది నుంచి నమూనాలను సేకరించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ఇప్పటివరకు కోటి నమూనాల ఫలితాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు.
కొత్తగా హుబేయ్ రాష్ట్రంలో 47 కేసులు నిర్ధారణ అయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో 31 స్థానికంగా నమోదుకాగా.. మిగిలిన 16 కేసులు బయటప్రాంతాల నుంచి వచ్చినవారిలో గుర్తించామన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 139గా ఉందని పేర్కొన్నారు.
ఈనెల 4న వుహాన్లో కరోనా పరీక్షలను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో కరోనా అనుమానితులుగా భావిస్తున్న 64 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
ఇదీ చదవండి : ఏడు నెలల పాటు స్థిరంగా యాంటీబాడీలు!