ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పబ్జీ గేమ్‌కు చైనాలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన పరీక్షల్లో పబ్జీ విఫలమైంది. అందుకే చైనా పబ్జీ విడుదలను విరమించుకుంటున్నట్టు వెల్లడించింది ఆ గేమ్‌ను నిర్వహిస్తున్న టెన్సెంట్ సంస్థ.
ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది పబ్జీ మొబైల్ గేమ్. అయితే హింసాత్మక ధోరణి పెరిగిపోతుందన్న కారణంతో ఇరాక్, నేపాల్ దేశాలతో సహా భారత్‌లోని గుజరాత్ రాష్ట్రం పబ్జీని నిషేధించింది.
పబ్జీ.. ఇక గేమ్ ఫర్ పీస్
పబ్జీని దక్షిణ కొరియాకు చెందిన బ్లూహోల్ సంస్థ ద్వారా ఏడాది క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది టెన్సెంట్. అయితే చైనాలో మాత్రం టెస్టింగ్ వెర్షన్ మాత్రమే విడుదలైంది. అయితే తాజాగా పబ్జీకి ఆ దేశ ప్రభుత్వ ఆమోదం లభించలేదు.
పబ్జీకి కొన్ని మార్పులు చేసి "గేమ్ ఫర్ పీస్" పేరుతో గేమ్‌ను రూపొందించింది టెన్సెంట్. ఈ గేమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చైనీయులకు సూచించింది. చైనా వైమానిక దళ సూచనలతో ఈ నూతన గేమ్‌ను రూపొందించారు.
ఇదీ చూడండి: ప్రఖ్యాత ఏనుగు పార్థన్ మృతి- మావటి కన్నీరు