ETV Bharat / international

'డేటా సేకరణ'పై 129 యాప్​లకు నోటీసులు

చట్టవిరుద్ధంగా సమాచారాన్ని సేకరిస్తున్నాయన్న ఆరోపణలతో 129 మొబైల్ యాప్​లకు నోటీసులు పంపించింది చైనా. 15 రోజుల్లోగా సమాచార సేకరణ విధానాన్ని మార్చుకోవాలని ఆదేశించింది. ప్రముఖ సంస్థలకు చెందిన యాప్​లు సైతం నోటీసులు అందుకున్న వాటిలో ఉన్నాయి.

author img

By

Published : Jun 12, 2021, 10:06 PM IST

China's internet watchdog issues notices to 129 mobile apps for illegally collecting personal info
అక్రమంగా డేటా సేకరణ- 129 యాప్​లకు నోటీసులు

వ్యక్తిగత సమాచారాన్ని చట్టవిరుద్ధంగా సేకరిస్తున్న 129 మొబైల్ యాప్​లకు చైనా ఇంటర్నెట్ నియంత్రణ సంస్థ సైబర్​స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నోటీసులు జారీ చేసింది. కొందరు యూజర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టింది. సదరు అప్లికేషన్లు అందించే సేవలకు అవి అడిగే పర్మిషన్లకు పొంతన లేదని వినియోగదారులు ఫిర్యాదు చేసినట్లు స్థానిక వార్తా ఛానెళ్లు తెలిపాయి. కొన్ని యాప్​లు అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని పేర్కొన్నాయి.

నోటీసులు అందుకున్న వాటిలో టిక్​టాక్ మాతృసంస్థ బైట్​డాన్స్​కు చెందిన జిన్రి టౌటియావో, టెన్సెంట్​కు చెందిన కువాయి బావో, టెన్సెంట్ న్యూస్, సగౌ న్యూస్, క్యుటౌటియాఓ వంటి యాప్​లు ఉన్నాయి. 15 రోజుల్లోగా తమ సమాచార సేకరణ విధానాన్ని మార్చుకోవాలని సైబర్​స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 129 యాప్​లను ఆదేశించింది.

మే నెలలో పలు యాప్​లపై చర్యలు తీసుకుంది చైనా. సొగౌ ట్రాన్స్​లేట్, బైడు మ్యాప్ సహా డజన్ల కొద్దీ యాప్​లను యాప్​ స్టోర్ నుంచి తొలగించింది.

ఇదీ చదవండి: గల్వాన్​ హీరోను కీర్తిస్తూ చైనా దేశభక్తి రాగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.