ETV Bharat / international

'అలీబాబా' మంత్రంతో కరోనాపై చైనా పోరు - china virus updates

చైనాలో కరోనా కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. గురువారం దేశీయంగా ఆరుగురికి కరోనా సంక్రమించగా.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్ సోకిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దిగ్గజ సాంకేతిక సంస్థలు అలీబాబా, టెన్సెంట్​... కరోనా పరీక్షలు చేయడం ప్రారంభించాయి.

china cases
చైనాలో తగ్గిన కరోనా కేసులు.. నిర్ధరణ పరీక్షల్లో టెక్ దిగ్గజాలు
author img

By

Published : Apr 24, 2020, 11:04 AM IST

చైనాలో కరోనా కేసుల వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గురువారం పదిలోపు మాత్రమే కేసులు నమోదయ్యాయి. దేశీయంగా ఆరుగురికి వైరస్ సంక్రమించిందని.. విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరిలో వైరస్ బయటపడిందని చైనా జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

చైనాలో ప్రస్తుతం 1,618 కరోనా కేసులు ఉన్నాయి. అందులో 32మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 34మందిలో వ్యాధి లక్షణాలు లేని 'దొంగ వైరస్' ఉన్నట్లు సమాచారం. చైనాలో ఇప్పటివరకు 82,804మంది వైరస్ బారినపడ్డారు. 4,632మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రైవేటు సంస్థల కరోనా పరీక్షలు

చైనాకు చెందిన టెక్ దిగ్గజాలు అలీబాబా, జెడీ. కామ్, టెన్సెంట్​లు కరోనా వైద్య పరీక్షలు చేయడం ప్రారంభించాయి. మహమ్మారి నివారణ, నియంత్రణ చేపట్టి దేశంలో ఉత్పత్తిని వేగవంతం చేసే దిశలోనే చైనా సర్కారు సాంకేతిక దిగ్గజ సంస్థలను వైద్య​ సేవల కోసం రంగంలోకి దించినట్లు సమాచారం.

అలీబాబాకు చెందిన వైద్య సేవల సంస్థ అలీహెల్త్.. షాంఘై, బీజింగ్ సహా 10 నగరాల్లో అపాయింట్​మెంట్లు ఇస్తోంది. ఈ వారంలో మరో 28 నగరాలకు తమ వైద్యసేవలను విస్తరించనుంది. జేడీ. కామ్​కు చెందిన జేడీ హెల్త్, టెన్సెంట్ సామాజిక మాధ్యమ విభాగం వీచాట్​ కూడా బీజింగ్, దక్షిణ చైనాలోని గువాంగ్ డాంగ్ రాజధాని గాంగ్జూ సహా వివిధ నగరాల్లో తమ వైద్య సేవలను ప్రారంభించాయి.

గాంగ్జూలో 2,08,000 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులపై న్యూక్లిక్ యాసిడ్ విధానంలో కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. 1,93, 000 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. 38,000 మంది ఫలితాలను అందుకున్నారు.

ఇదీ చూడండి: ఆ రెండు మరణాలను ముందే గుర్తించి ఉంటే...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.