ETV Bharat / international

మార్స్​పై ల్యాండింగ్ ఫుటేజ్​ పంపిన చైనా రోవర్

అంగారకుడిపై గత నెల 15న దిగిన చైనా ఉపగ్రహం తియాన్​వెన్-1కు చెందిన రోవర్‌ జురోంగ్.. అక్కడి నుంచి వీడియోలు, ఫొటోలను పంపింది. రోవర్‌కు అమర్చిన కెమెరా అంగారకుడిపై దృశ్యాలను చిత్రీకరించి భూమికి పంపించింది.

china, rover
చైనా, రోవర్
author img

By

Published : Jun 27, 2021, 10:20 PM IST

చైనా రోవర్​ పంపిన ఫుటేజ్​లు

అంగారకుడిపై దిగిన చైనా ఉపగ్రహం తియాన్​వెన్-1కు చెందిన రోవర్​ జురోంగ్.. మార్స్​ నుంచి ఫొటోలను, వీడియోలను పంపించింది. రోవర్​ మార్స్​ ఉపరితలాన్ని చేరుకోవడం, పారాచూట్ తెరుచుకోవడం మొదలైన దృశ్యాలను చిత్రీకరించింది. రోవర్​ దిగుతున్న సమయంలో చేసిన శబ్దాలను కూడా రికార్డు చేసి పంపించింది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ సీసీటీవీ ఫుటేజ్​లను విడుదల చేసింది.

" ఈసారి విడుదల చేసిన ఫుటేజ్ల ఆధారంగా.. అంగారకుడి ఉపరితలంపై ఉన్న వాతావరణ మార్పులను పూర్తి స్థాయిలో అంచనా వేయగలం. మార్స్​ రోవర్​ ల్యాండర్​ నుంచి విడిపోయినప్పుడు చేసిన శబ్దాల ఫుటేజ్​ కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది."

--లియ్ జిఝాంగ్, డిప్యూటీ కమాండర్.

240 కిలోల బరువున్న జురోంగ్​.. మే 14న అరుణ గ్రహ దక్షిణార్ధగోళంలోని ఉటోపియా ప్లానీషియా అనే ప్రాంతంలో అడుగుపెట్టింది. అరుణ గ్రహంపై నీరు, మంచుకు మూలాలను శోధించేందుకు చైనా చేపట్టిన ఈ ఉపగ్రహ ప్రయోగంలో భాగంగా....రోవర్‌ జురోంగ్ 90 రోజులు ప్రయాణిస్తుందని అంచనా. ఇందులో 42 రోజులు పూర్తి కాగా, రోవర్‌ 236 మీటర్లు ప్రయాణించింది.

ఇదీ చదవండి:

అంగారకుడి చిత్రాలను పంపిన చైనా రోవర్​

మార్స్​పై కాలు మోపిన చైనా తొలి రోవర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.