కరోనా వైరస్ ధాటికి చైనా విలవిలలాడుతోంది. తాజాగా మరో 139 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మృతుల సంఖ్య 1662కు చేరింది. మరో 1,843 నూతన కేసులు నమోదైనట్టు చైనా ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 68వేల మందికి ప్రాణాంతక వైరస్ సోకినట్టు స్పష్టం చేసింది.
తరలిపోతున్న విదేశీయులు...
కరోనా భయంతో చైనా నుంచి తమ పౌరులను వెనక్కి రప్పించుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. తాజాగా ఈ జాబితాలో నేపాల్ కూడా చేరింది. వైరస్ కేంద్రబిందువైన వుహాన్ నుంచి 175 మంది నేపాలీలను నేపాల్ ఎయిర్‌లైన్స్ ద్వారా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
ఇదీ చూడండి:- ఆసియా దాటిన కారోనా... ఫ్రాన్స్‌లో తొలి మరణం