ETV Bharat / international

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్ ప్రారంభం

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్​ను చైనా ప్రారంభించింది. జిన్​షా నదిపై నిర్మించిన 'ది బైహేతన్' డ్యాంలో మొత్తం 16 యూనిట్లు ఉండగా.. రెండు యూనిట్లు సోమవారం ఆరంభమయ్యాయి.

world's second-biggest hydropower dam
అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్
author img

By

Published : Jun 28, 2021, 2:48 PM IST

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్​ 'ది బైహేతన్'​ను చైనా ప్రారంభించింది. ఈ ఆనకట్టలో మొత్తం 16 యూనిట్లు ఉండగా.. తొలి విడతగా రెండు యూనిట్లను సోమవారం ప్రారంభించినట్లు చైనా ప్రకటించింది.

289 మీటర్ల ఎత్తులో..

biggest hydropower dam
జిన్​షా నదిపై భారీ డ్యామ్
biggest hydropower dam
రెండు యూనిట్లలో నీరు పారుతూ..

ఈ డ్యామ్​ను యాంగ్జే నదికి ఉపనది అయిన జిన్​షా నదిపై నిర్మించారు. ఈ డ్యాం ఎత్తు 289 మీటర్లు ఉంది. మొత్తం 16 యూనిట్లు ఉండగా.. ఒక్కో యూనిట్ 1 మిలియన్ కిలోవాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట త్రీ గోర్జెస్ డ్యామ్​ను 2003లో యాంగ్జే నదిపై నిర్మించింది చైనా ప్రభుత్వం. ఈ రెండు డ్యామ్​లను ప్రభుత్వ రంగ సంస్థ అయిన త్రీ గోర్జెస్ కార్పొరేషన్ నిర్మించింది.

biggest hydropower dam
డ్యామ్ అంతర్బాగంలో..
biggest hydropower dam
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డ్యామ్

పట్టించుకోని హెచ్చరికలు..

ఓ వైపు ఇలాంటి పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించటం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా.. చైనా ప్రభుత్వం మాత్రం బొగ్గు వినియోగాన్ని తగ్గించుకోవటం కోసం ఆనకట్టలు నిర్మిస్తోంది.

biggest hydropower dam
డ్యామ్ పనితీరును పరిశీలిస్తూ..

ది బైహేతన్ డ్యామ్​ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే.. ఏడాదికి 20మిలియన్ల టన్నుల బొగ్గును వినియోగించే భారం తగ్గుతుందని త్రీ గోర్జెస్ గ్రూప్ పేర్కొంది.

ఇదీ చదవండి : Florida building collapse: శిథిలాల కింద 159 మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.