ETV Bharat / international

నేపాల్​ రాజకీయాల్లో మరోసారి చైనా జోక్యం! - china nepal latest news

నేపాల్​ కమ్యూనిస్టు పార్టీలో చీలికలు ఆపేందుకు చైనా రంగంలోకి దిగనుంది. పార్లమెంటు రద్దు అనంతరం రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ, ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ ప్రచండ వర్గం నేతలతో సంప్రదింపులు జరపనుంది. చైనీస్​ కమ్యూనిస్టు పార్టీ వైస్​ మినిస్టర్​ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం ఆదివారం కాఠ్​మాండూ వెళ్తుందని అక్కడి వార్తా పత్రిక కథనం ప్రచురించింది.

author img

By

Published : Dec 27, 2020, 5:47 AM IST

నేపాల్​ రాజకీయాల్లో చైనా మరోసారి తలదూర్చనుంది. ప్రధాని కేపీ శర్మ ఓలి.. పార్లమెంటును అర్ధాంతరంగా రద్దు చేసిన అనంతరం ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఓలి వర్గం, ప్రచండ(పుష్ప కుమార్​ దహల్) వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరి ​ నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలికలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో చైనా రంగంలోకి దిగి దీన్ని అడ్డుకోవాలని భావిస్తోంది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వైస్ మినిస్టర్​ నేతృత్వంలో నలుగురు సభ్యులను ఆదివారం కాఠ్​మాండూకు పంపనుంది. నేపాల్​ రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది.

ఎన్సీపీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని ధ్రువీకరించారని కాఠ్​మాండూ పోస్ట్​ న్యూస్ పేపర్​ కథనం ప్రచురించింది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వైస్ మినిస్టర్​ గువో యెజోవ్​ కాఠ్​మాండూకు ఆదివారం చేరుకుంటారని వారు చెప్పినట్లు పేర్కొంది. అయితే ఈ విషయంపై నేపాల్​లోని చైనా రాయబార కార్యాలయం మాత్రం స్పందించడం లేదని వార్తా పత్రిక తెలిపింది.

నాలుగు రోజులు మకాం..

చైనీస్​ కమ్యూనిస్టు పార్టీ బృందం కాఠ్​మాండూలోనే 4 రోజులు మకాం వేసి ఎన్సీపీలోని ఓలి, ప్రచండ వర్గం నేతలతో చర్చలు జరుపుతుందని నేపాల్​ వార్తా సంస్థ పేర్కొంది. సమస్యను పరిష్కరించి పార్టీ చీలిపోకుండా ఆపేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొంది. నేపాల్​లోని చైనా రాయబారి ఇప్పటికే ప్రచండ వర్గం నేతలతో చర్చలు జరిపారు. ఇప్పుడు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నేతలు రంగంలోకి దిగనున్నారు.

విమర్శలు..

తమ దేశ రాజకీయాల్లో చైనా జోక్యంపై నేపాల్​లోని పలు రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. అనేక మంది నేపాల్ విద్యార్థులు చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ దేశ రాయబార కార్యాలయం ముందు నిరసనలు కూడా చేపట్టారు.

నేపాల్ రాజకీయాల్లో చైనా తలదూర్చడం కొత్తేమీ కాదు. హిమాలయ దేశంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూ ఆ దేశానికి మరింత దగ్గరవుతోంది. అనేక ప్రాజెక్టులను నిధులు సమకూర్చుతూ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. చైనీస్​ కమ్యూనిస్టు పార్టీ, నేపాల్​ కమ్యూనిస్టు పార్టీల మధ్య తరచూ శిక్షణ కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి. ఓలీ, ప్రచండలు తమ పార్టీలను విలీనం చేసి ఎన్సీపీని ఏర్పాటు చేసిన ప్రక్రియలోనూ చైనా పాత్రే కీలకం.

ఇదీ చూడండి: నేపాల్ పార్లమెంటు రద్దు- వేసవిలో ఎన్నికలు

ప్రచండతో చైనా రాయబారి కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.