ETV Bharat / international

మిడతలతో యుద్ధం కోసం పాక్​కు చైనా 'బాతుల సైన్యం' - మిడతలు చైనా పాక్ బాతులు

పంట పొలాలపై మిడతల దాడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్​కు చైనా ఆపన్న హస్తం అందించనుంది. మిడతల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బలమైన బాతుల సైన్యాన్ని పాక్​కు పంపించనున్నట్లు చైనా స్థానిక మీడియా పేర్కొంది.

China duck army locusts pakistan
మిడతలు చైనా పాక్ బాతులు
author img

By

Published : Feb 27, 2020, 3:17 PM IST

Updated : Mar 2, 2020, 6:19 PM IST

కొద్ది నెలలుగా మిడతల బెడదతో సతమతమవుతోన్న పాకిస్థాన్​కు చైనా సాయం చేసేందుకు సిద్ధమైంది. లక్షకుపైగా బలమైన బాతుల దండును పాకిస్థాన్​కు పంపేందుకు కసరత్తు చేస్తున్నట్లు చైనా స్థానిక మీడియా వెల్లడించింది.

తూర్పు చైనా ఝెజియాంగ్ రాష్ట్రం​​ నుంచి... కమల పుష్పాలను తినే నీటి పక్షుల దళాన్ని సైతం పంపించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు నిపుణుల బృందమూ పాక్​కు వెళ్లే అవకాశం ఉన్నట్లు మీడియా పేర్కొంది.

అయితే పాకిస్థాన్​కు బాతులను పంపించే విషయమై ప్రభుత్వ అధికారులను సంప్రదించగా... వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

బాతులే ఎందుకు!

క్రిమి సంహారకాలతో పోలిస్తే ఈ బాతులను ఉపయోగించడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. అంతేకాక ఇది తక్కువ ఖర్చుతో కూడుకుంది. ఈ కారణంగా చైనా ప్రభుత్వం వీటిని ఎప్పటినుంచో ఉపయోగిస్తోంది. కీటకాలను నాశనం చేయడానికి ఇరవై ఏళ్ల క్రితం నుంచే వీటిని వాడుతోంది.

ఒక బాతు రోజుకు 200 మిడతలను తినగలదు. కోళ్లతో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. దీంతో కోళ్ల కంటే బాతులను ఉపయోగించడమే మేలని పరిశోధకులూ సూచిస్తున్నారు. బాతులు ఒకేచోట గుంపులుగా ఉంటాయి కాబట్టి వాటిని అదుపు చేయడం కూడా తేలికేనని చెప్పుకొచ్చారు.

మిడతల సంక్షోభంలో పాక్

గతేడాది నుంచి పాకిస్థాన్​లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాలు తీవ్రమైన మిడతల సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెద్ద ఎత్తున మిడతల గుంపు ఆ ప్రాంతాల్లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఫలితంగా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. నష్టనివారణ చర్యలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం... పాక్​లో అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. సంక్షోభాన్ని అధిగమించడానికి సుమారు రూ. 730 కోట్లు అవసరమని అంచనా వేసింది.

ఇదీ చదవండి: కరోనా సోకలేదని అబద్ధం చెప్పినందుకు కేసు!

Last Updated : Mar 2, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.