అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు మధ్య, దక్షిణాసియా దేశాధినేతలతో వర్చువల్ భేటీ నిర్వహించనున్నట్లు చైనా(China Afghan) తెలిపింది. ఈ సమావేశాన్ని చైనా, రష్యా నేతృత్వంలోని షాంఘై సహకార సంస్థ.. గురువారం నిర్వహించనుంది. అయితే ఇందులో పరిశీలక సభ్య దేశమైన అఫ్గాన్‌లో ఇటీవల తాలిబన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని(Taliban government) గుర్తించడంపై.. చైనా(china Afghanistan relations) స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాలిబన్(Taliban news) ప్రతినిధిగా ఎవరు హాజరవుతారనే దానిపై స్పష్టత లేదు.
అయితే అఫ్గాన్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొనడానికి అమెరికా కారణమని చైనా ఆరోపిస్తోంది. హడావిడా బలగాల ఉపసంహరణతో(US army in Afghanistan) తాలిబన్లు అఫ్గాన్‌ని ఆక్రమించుకున్నారని వ్యాఖ్యానించింది.
ఏది.. ఏమైనప్పటికీ మధ్య ఆసియాలో రాజకీయ చర్చలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాంతంలో అమెరికా ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చూడండి: China Afghan: 'అఫ్గాన్' ఊరిస్తున్నా.. చైనాకు అందని ద్రాక్షే!