ETV Bharat / international

కీలక అజెండాలతో మార్చి 5న చైనా పార్లమెంట్ భేటీ - Communist Party of China

వచ్చే ఏడాది మార్చి 5న పార్లమెంట్ వార్షిక సమావేశాలను నిర్వహించాలని చైనా నిర్ణయించింది. 14వ పంచవర్ష ప్రణాళికతో పాటు కీలకమైన చట్టాలు, దీర్ఘ కాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించనుంది. వార్షిక మిలిటరీ బడ్జెట్​ను సైతం ఇందులోనే ప్రకటించే అవకాశం ఉంది.

China to hold Parliament session in March to approve key plans
చైనా పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
author img

By

Published : Dec 27, 2020, 9:53 AM IST

కరోనా కారణంగా ఈ ఏడాది నిలిచిపోయిన చైనా పార్లమెంట్ వార్షిక సమావేశాన్ని 2021 మార్చి 5న నిర్వహించనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. దేశంలోని కీలక అడ్వైజరీ అయిన.. చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్​తో సంయుక్తంగా జరిగే ఈ సమావేశాలు రెండు వారాల పాటు కొనసాగుతాయి. చైనా ప్రీమియర్ లీ కెకియాంగ్ సమర్పించే నివేదికను ఆమోదించిన తర్వాత.. జాతీయ అజెండాను పార్లమెంట్ నిర్దేశిస్తుంది.

అధ్యక్షుడు షీ జిన్​పింగ్ దీర్ఘకాలిక వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 2035 నాటికి సాధించాల్సిన లక్ష్యాలతో రూపొందించిన 14వ పంచవర్ష ప్రణాళికను ఆమోదించడం ఈ సమావేశంలో కీలక అజెండాగా ఉండనుంది. కీలకమైన చట్టాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించనుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలకు చైనా కమ్యునిస్టు పార్టీ(సీపీసీ) ఇదివరకే ఆమోద ముద్ర వేసింది. వార్షిక మిలిటరీ బడ్జెట్​ను సైతం ఈ సమావేశాల్లో ప్రకటించనుంది. 2027 నాటికి అమెరికాకు ధీటుగా తన సైన్యాన్ని తయారుచేసుకోవాలన్న ప్రణాళికకు సీపీసీ ఇదివరకే ఆమోదం తెలిపింది. కేంద్ర, స్థానిక బడ్జెట్​ను అమలు చేసే అంశంపైనా పార్లమెంట్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మూడు వేల మంది చట్టసభ్యులు ఉండే చైనా 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్'(పార్లమెంట్) సమావేశాలు ప్రతి ఏటా జరుగుతాయి. ఇందులోని సభ్యులు ఎక్కువ మంది అధికార కమ్యునిస్టు పార్టీకి చెందినవారే. ఈ ఏడాది మార్చిలో ఈ సమావేశాలు జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా చరిత్రలో తొలిసారి వాయిదా పడ్డాయి. చైనా కమ్యునిస్టు పార్టీ ప్రతిపాదించే అంశాలను గుడ్డిగా ఆమోదించే రబ్బర్ స్టాంప్​గా పార్లమెంట్ వ్యవహరిస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి.

ఈసారి కీలకం

చైనా కమ్యునిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత దేశంలో అత్యంత శక్తిమంతమైన నేతగా పేరు సంపాదించారు షీ జిన్​పింగ్. తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు జిన్​పింగ్ ప్రణాళికలు వేసుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనాను ఆర్థికంగా రెండో స్థానానికి తీసుకెళ్లిన ఎగుమతి ఆధారిత ప్రణాళికలు కాకుండా.. దేశీయ వినియోగంపై ఆధారపడే అభివృద్ధి నమూనాను రూపొందిస్తున్నట్లు ఇదివరకే స్పష్టం చేశారు జిన్​పింగ్. అధునాతన సామ్యవాద దేశాన్ని నిర్మించే దిశగా వచ్చే ఏడాది నుంచి ప్రయాణం ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.