ETV Bharat / international

గల్వాన్​ హీరోను కీర్తిస్తూ చైనా దేశభక్తి రాగం! - india china border news

గతంలో ఎన్నడూ లేని విధంగా సైనికుల త్యాగాలను కీర్తిస్తూ దేశభక్తిని పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది చైనా కమ్యూనిస్టు పార్టీ. గతేడాది గల్వాన్​ లోయలో భారత బలగాలతో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలకు తెగించి పోరాడిన తమ జవాన్ల పాత్రను కొనియాడుతోంది. ఆ ఘటన సమయంలో కమాండర్ క్వి ఫబావ్​ మాటలను చైనా ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.

China showcases Galwan hero to drill patriotism
సైనికులను కీర్తిస్తూ చైనా దేశభక్తి రాగం!
author img

By

Published : Jun 12, 2021, 7:24 PM IST

Updated : Jun 13, 2021, 11:40 AM IST

గల్వాన్​లో హింసాత్మక ఘర్షణలు జరిగి జూన్​ 15కు ఏడాది. చైనా కమ్యూనిస్టు పార్టీని స్థాపించి జులై 1 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. ఆగస్టు 1న చైనా ఆర్మీ డే. ఈ నేపథ్యంలో సైనికుల త్యాగాలను కీర్తిస్తూ ఎన్నడూ లేని విధంగా దేశభక్తిని పెంపొందించే పనిలో నిమగ్నమైంది డ్రాగన్ దేశం. గతేడాది జూన్​ 15న తూర్పు లద్దాక్​లో భారత బలగాలతో జరిగిన ఘర్షణలో తమ రెజిమెంటల్ కమాండర్​ క్వి ఫబావ్​ పోరాడిన దృశ్యాలను చైనా ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.

ఫిబ్రవరి 19న కూడా గల్వాన్ ఘటనకు సంబంధించిన వీడియోను చైనా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. భారత సైనికులు చైనా సరిహద్దులోకి చొచ్చుకువెళ్తుండగా తమ కమాండర్​ వారిని నిలువరించినట్లు తప్పుడు ప్రచారం చేసింది.

మినీ యుద్ధం..

గతేడాది జరిగిన ఈ భయానక ఘర్షణలో తమ సైనికులు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. వీరిలో కమాండింగ్​ ఆఫీసర్​ కర్నల్ సంతోష్​ బాబు కూడా ఉన్నారు. మినీ యుద్ధాన్ని తలపించిన గల్వాన్​ లోయ ఘటనలో రాళ్లు, ఇనుప రాడ్లు, మారణాయుధాలతో భారత్​, చైనా సైనికులు పరస్పరం దాడి చేసుకున్నారు.

శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సైనిక గౌరవ సమావేశంలో క్వి పభావ్ పోరాట దృశ్యాలను ప్రసారం చేశారు. " మన భూభాగంలోని అంగులం భూమికూడా పోనివ్వం. అందుకు మేము ప్రాణత్యాగానికైనా సిద్ధం. బలగాలను ఖడ్గంతో పోల్చితే.. సైనికుల ధైర్యం, నిబద్ధత ఆ ఖడ్గానికి పదునైన అంచు వంటివి" అని కమాండర్​ క్వి ఫబావ్​ వీడియోలో అన్నారు.

ఈ సమావేశాన్ని చైనా అత్యున్నత సైనిక నిర్ణయాత్మక సంస్థ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) పొలిటికల్ వర్క్ డిపార్ట్​మెంట్​ నిర్వహించింది. సీఎంసీ ద్వారానే చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) మిలిటరీ పౌర పర్యవేక్షణను నిర్వహిస్తుంది. సైన్యాన్ని రాజకీయంగా సిద్ధాంతీకరించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా క్వి ఫబావ్​ను చైనా కీర్తిస్తోంది. గల్వాన్ ఘర్షణలో అతని తలకు అయిన గాయం మచ్చ ఇంకా స్పష్టంగా కన్పిస్తోంది. లోయలో పడిపోయిన నలుగురు చైనా సైనికుల గురించి కూడా క్వి ప్రస్తావించారు.

కొత్త చట్టం..

సైనికుల కోసం తెచ్చిన కొత్త చట్టాన్ని చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్​ ఆమోదించడానికి ఒక్క రోజు ముందు ఆ దేశ ప్రభుత్వ సంస్థలు దీనిపై ప్రచారం చేశాయి. కొత్త చట్టం ప్రకారం ఏ సంస్థ గానీ, వ్యక్తి గానీ ఏ విధంగానూ సైనికులను కించపరచడం, వారి ఆత్మగౌరవానికి భంగం కల్గించడానికి వీల్లేదు. సైనిక సిబ్బంది గౌరవార్థం ఏర్పాటు చేసిన ఫలకాలను అపవిత్రం చేయొద్దు. అలా చేస్తే కఠిన శిక్షలు విధిస్తారు. ఒక సైనికుడు పొందిన గౌరవాలను జీవితకాలం ఆనందించవచ్చు. చట్టబద్ధమైన కారణాలు లేదా చట్టబద్ధమైన విధానాల ద్వారా తప్ప వీటిని ఉపసంహరించడానికి వీల్లేదు.

బ్లాగర్ అరెస్టు..

25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ప్రముఖ చైనీస్ బ్లాగర్ క్వియూ జిమింగ్​కు మే 31న 8 నెలల జైలు శిక్ష విధించారు. గల్వాన్ ఘటనలో మరణించిన చైనా సైనికుల సంఖ్య గురించి అతడు ప్రశ్నించడమే ఇందుకు కారణం. ఈ ఘటనలో ఇంకా ఎక్కువ మంది సైనికులు మరణించి ఉంటారని, ఉన్నత ర్యాంకు అధికారి అయినందు వల్లే కమాండింగ్ ఆఫీసర్ ప్రాణాలతో బయటపడ్డాడని ఇతడు తన బ్లాగ్​లో రాసుకొచ్చాడు.

అమెరికా నివేదిక..

ఆర్మీని ఆధునికీకరించడానికి, సంస్కరించడానికి, పునర్​వ్యవస్థీకరించడానికి చైనా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో సైన్యాన్ని అంతర్భాగంగా భావిస్తోంది. రాజకీయ విద్య, పర్యవేక్షణ పేరుతో అమెరికా కాంగ్రెషనల్​ రీసెర్చ్ సర్వీస్​ గత వారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆర్మీ నాయకత్వ శ్రేణి ప్రతి స్థాయిలో రాజకీయ అధికారులు, ఇతర పార్టీ సంస్థల ఉనికి ఉండేలా చేయడం ఆర్మీ కార్యకలాపాల్లోని కీలక అంశాలని పేర్కొంది.

ఇదీ చూడండి: హైపర్​సోనిక్​ గ్లైడ్స్​తో సూపర్​ పవర్​గా చైనా!

Last Updated : Jun 13, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.