ETV Bharat / international

kabul airport blast: 'అఫ్గాన్​లో పరిస్థితులు ఆందోళనకరం' - ఎయిర్​పోర్ట్​ అటాక్స్​పై రష్యా

కాబుల్​లో జరిగిన ఆత్మాహుతి దాడిని చైనా తీవ్రంగా ఖండించింది. అఫ్గాన్​లో పరిస్థితులు చక్కదిద్దేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

Kabul suicide attack
కాబుల్​ ఆత్మాహుతి దాడి
author img

By

Published : Aug 27, 2021, 9:04 PM IST

కాబుల్​ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిపై చైనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అఫ్గానిస్థాన్​లో భద్రతా పరిస్థితులు మరింత దారుణంగా మారినట్లు తెలిపింది. ఉగ్రవాదుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న అఫ్గాన్​ను రక్షించేందుకు చైనా.. ఇతర దేశాలతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ చెప్పారు. ఇప్పటికీ అఫ్గాన్​లో చైనా రాయబార కార్యాలయం పని చేస్తోందని స్పష్టం చేశారు. గురువారం జరిగిన దాడిలో తమ దేశం పౌరులు ఎవరు చనిపోలేదని తెలిపారు.

"కాబుల్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిపై చైనా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దీనిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఘటన అఫ్గాన్​లో నెలకొన్న భద్రతా పరిస్థితులకు అద్దం పడుతోంది. పరిస్థితిని అందుపులోకి తీసుకొచ్చేందుకు సంబంధిత వర్గాలు దృష్టిసారిస్తాయని భావిస్తున్నాం."

-జావో లిజియాన్​, చైనా విదేశాంగ ప్రతినిధి

రష్యా కూడా..

కాబుల్​లో జరిగిన బాంబు దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. అఫ్గాన్​లో నెలకొన్న పరిస్థితులపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆదేశ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్​ చెప్పారు. ఎయిర్​పోర్ట్​ వద్ద భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ముందస్తుగానే హెచ్చరించినా.. ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.

కాబుల్​ ఎయిర్​పోర్ట్​ నిర్వహణకు సంప్రదింపులు..!

కాబుల్​ ఎయిర్​పోర్ట్ నిర్వహణను చేపట్టాలని తాలిబన్లు టర్కీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు ఆ దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తెలిపారు. అయితే దీనిపై ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అఫ్గాన్​లో ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆలోచిస్తామన్నారు. అయితే సంప్రదింపులు ఎప్పుడు జరిగాయి అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.

గురువారం ఎయిర్​పోర్ట్​ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిని తయ్యిప్​ తీవ్రంగా ఖండించారు.

ఇదీ చూడండి: కాబుల్​ పేలుళ్లకు తాలిబన్ల సాయం! ఆ రెండు చెక్​పోస్టులు దాటించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.