ETV Bharat / international

కరోనా కల్లోలం: చైనాలో 1,770కి చేరిన మృతులు - china-sees-rise-in-new-virus-cases-death-toll-rises-by-105

కరోనా వైరస్​ ఉధ్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా చైనాలో వైరస్​తో మృతిచెందిన వారి సంఖ్య 1,770కు చేరింది. మరో 2,048 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ వెల్లడించింది.

china-sees-rise-in-new-virus-cases-death-toll-rises-by-105
కరోనా కల్లోలం: చైనాలో 1770కు చేరిన మృతులు
author img

By

Published : Feb 17, 2020, 9:58 AM IST

Updated : Mar 1, 2020, 2:28 PM IST

ప్రాణాంతక కరోనా వైరస్​తో చైనా అల్లాడిపోతోంది. ఈ మహమ్మారి బారినపడి ఇవాళ ఒక్కరోజే 105మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 100మంది హుబెయ్​ రాష్ట్రానికి చెందిన వారే ఉండటం గమనార్హం.

చైనాలో మొత్తం మృతుల సంఖ్య 1,770కు చేరింది. కొత్తగా మరో 2,048 మంది వైరస్​ బారిన పడ్డారు. చైనాలో ఇప్పటివరకు 70,548 మందికి ఈ వైరస్​ సోకినట్టు స్పష్టం చేసింది ఆ దేశ ఆరోగ్య శాఖ. 10,844 మంది వైరస్​ నుంచి తేరుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. 7,264 అనుమానిత కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

కేసులు తగ్గుతున్నా.. అప్రమత్తత అవసరం..

వైరస్​ కేంద్ర బిందువైన వుహాన్​ మినహా.. చైనావ్యాప్తంగా వైరస్​ కేసులు తగ్గుతున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే కరోనా ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో చెప్పలేమని.. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) సూచించింది.

నౌకలోని ఆ 40మందికి...

మరోవైపు జపాన్​లో నిర్బంధంలో ఉన్న నౌకలోని 40మంది అమెరికన్లకు వైరస్​ సోకినట్టు నిర్ధరించారు. అయితే నౌకలోని అగ్రరాజ్య పౌరులను తరలించేందుకు ఏర్పాటు చేసిన కార్యకలాపాలకు ఈ 40మంది దూరంగా ఉంటారని యూఎస్​ స్పష్టం చేసింది.

Last Updated : Mar 1, 2020, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.