తూర్పు లద్దాఖ్‌లో ఏర్పడిన సరిహద్దు వివాదం మరింత పెద్దదిగా కాకుండా భారత్, తాము పని చేస్తున్నట్లు చైనా తెలిపింది. తదుపరి విడత చర్చల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు సంప్రదింపులు జరుపుతామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ వెల్లడించారు. సరిహద్దు వివాదంపై దౌత్య, సైనిక మార్గాల్లో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఏకాభిప్రాయాన్ని అమలు చేయడాన్ని ఆధారంగా చేసుకుని తదుపరి విడత చర్చలకు ఏర్పాట్లు చేసుకుంటామని వెల్లడించారు.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సరిహద్దు ఆక్రమణలకు ప్రయత్నించడంతో ఈ ఏడాది మే నుంచి రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. దీన్ని పరిష్కరించేందుకు ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఇరుదేశాల సైనిక వర్గాలు భేటీ అయ్యాయి.
ఇదీ చదవండి: గాలి నుంచి నీటి తయారీ- ఐఐటీ గువాహటి ఘనత