సరిహద్దుల్లో దుస్సాహసాలకు పాల్పడుతున్న డ్రాగన్‌ను దెబ్బకొట్టేలా పబ్జీ సహా 118 యాప్‌లను భారత్ నిషేధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ చర్యలు చైనా పెట్టుబడిదారులు, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధమైన ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని మండిపడింది. ఈ మేరకు చైనా వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గో ఫెంగ్ మీడియాతో మాట్లాడారు. ఈ తప్పును భారత్ సరిచేసుకోవాలని చైనా కోరుకుంటోందని తెలిపారు.
యువతలో విశేష ఆదరణ పొందిన ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ సహా మొత్తం 118 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది దేశ సార్వభౌమత్వం, రక్షణకు ఇవి ముప్పుగా ఉన్నందువల్లే వేటు వేసినట్టు స్పష్టం చేసింది. జూన్ నెలలో గల్వాన్ వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా వందకు పైగా చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించగా.. తాజాగా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో 118 యాప్‌లను నిషేధించింది.
ఇదీ చూడండి: అమెరికా ఎన్నికల్లో చైనాపై ఎందుకింత రగడ?