ETV Bharat / international

'డబ్ల్యూహెచ్​ఓ ప్రకటనతో షాక్​ అయ్యాం' - కొవిడ్​ మూలాలు

కరోనా మూలాలు తెలుసుకునేందుకు మరోసారి దర్యాప్తు చేపడతామన్న డబ్ల్యూహెచ్​ఓ ప్రకటన తమను షాక్​కు గురిచేసిందని చైనా పేర్కొంది. కరోనా వుహాన్​ ల్యాబ్​ నుంచి లీక్​ అయిందన్న వాదన సైన్స్​కు విరుద్ధమైనదని తెలిపింది.

covid origin study china
'డబ్ల్యూహెచ్​ఓ ప్రకటనకు షాక్​ అయ్యాము'
author img

By

Published : Jul 22, 2021, 11:02 AM IST

కరోనా మూలాలను కనుగొనేందుకు మరో విడత దర్యాప్తు చేపడతామన్న డబ్ల్యూహెచ్​ఓ ప్రకటనపై చైనా స్పందించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన తమను.. షాక్​కు గురిచేసిందని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి జెంగ్​ యిక్సిన్ గురువారం వ్యాఖ్యానించారు. కరోనా వుహాన్​ ల్యాబ్​ నుంచి లీక్​ అయిందన్న వాదనలను కొట్టిపారేశారు. ఈ వదంతులు సైన్స్​కు విరుద్ధమైనవని పేర్కొన్నారు.

మహమ్మారికి చైనాలోని వుహాన్​ ల్యాబే మూలం అనే వాదన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హయాంలో మొదలైంది. చైనా వుహాన్​ ల్యాబ్​లో కరోనాకు సంబంధించి ఉన్న వివరాలను తొలగించే ప్రయత్నం చేస్తోందన్న కథనాలు ఈ వాదనలకు బలం చేకూర్చాయి. డబ్ల్యూహెచ్​ఓ మొదట ఈ వాదనలను తోసిపుచ్చినా.. ప్రపంచ దేశాల ఒత్తిడితో వైరస్​ మూలాలు తెలుసుకునేందుకు చైనాలో పర్యటన చేపట్టింది. అయితే ఆ పర్యటనలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల ప్రపంచ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

మరోసారి..

ఇందుకు డబ్ల్యూహెచ్​ఓ కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మారి వ్యాప్తికి చైనాలోని ల్యాబ్​ లీక్​కు సంబంధం లేదని ఓ నిర్ణయానికి రావడం సరికాదని పేర్కొంది.

అయితే చైనా మాత్రం మొదటి నుంచి కరోనా వైరస్​ పుట్టుకపై వస్తున్న వాదనలను తోసిపుచ్చుతోంది. అంతేకాదు.. వుహాన్ శాస్త్రవేత్తల బృందం కరోనాపై చేస్తున్న పరిశోధనలకు వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్​ చేసింది.

ఇదీ చదవండి : సరిహద్దుల్లో చైనా దుడుకుతనం ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.