ETV Bharat / international

'ఆ అంశాలపై అమెరికాతో చర్చలకు అంగీకారం' - అలస్కా

వాతావరణ మార్పు, అలస్కాలో అమెరికా లెేవనెత్తిన ఇతర అంశాలపై చర్చించేందుకు అంగీకారం కుదిరిందని చైనా తెలిపింది. దీని కోసం ఓ వర్కింగ్​ గ్రూప్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

China says it will discuss climate, other issues with US
'ఆ అంశాలపై అమెరికాతో చర్చలకు సిద్ధం'
author img

By

Published : Mar 20, 2021, 10:35 PM IST

అమెరికాతో వాతావరణ మార్పు అంశంపై మాట్లాడేందుకు అంగీకారం కుదిరినట్లు చైనా తెలిపింది. దీనిపై ఒక వర్కింగ్​ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అయితే అలస్కా సమావేశంలో చర్చకు వచ్చిన జర్నలిస్టుల అంశం, ఇంకా దౌత్యవేత్తలపై ఇరు దేశాలు విధించుకున్న ఆంక్షల విషయాలపై మాత్రం చైనా​ మౌనం వహించింది.

గతంలో చైనాలో ఉన్న అమెరికా మీడియా జర్నలిస్టుల వీసాలపై డ్రాగన్ దేశం నిషేధం విధించింది. అమెరికాలో ఉన్న చైనా జర్నలిస్టుల వీసాలపై ట్రంప్​ ప్రభుత్వం నిషేధం విధించింది. అది ఇప్పటికీ కొనసాగుతుండగా.. తాజాగా ఇరు దేశాల మధ్య అలస్కాలో జరిగిన సమావేశం తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేసేందుకు చర్చలు జరుపుకోవాలని అమెరికా, చైనాలు నిర్ణయించాయి.

ఇదీ చదవండి: ఐరాస వేదికగా అమెరికా-చైనా మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.