ETV Bharat / international

'జూన్​ నాటికి 40% జనాభాకు కరోనా టీకా' - Coronavirus vaccination in china news updates

ఈ ఏడాది జూన్​ నాటికి తమ దేశ జనాభాలో 40 శాతం మందికి కరోనా టీకా అందిస్తామని చైనా పేర్కొంది. వైరస్​ వ్యాప్తి నియంత్రణ కారణంగానే వ్యాక్సినేషన్​ ప్రక్రియలో వెనుకబడినట్లు చెప్పుకొచ్చారు ఆ దేశ వైద్య నిపుణులు.

China says it aims to vaccinate 40% of population by June
'జూన్​ నాటికి 40 శాతం జనాభాకు కరోనా టీకా'
author img

By

Published : Mar 3, 2021, 12:12 PM IST

ప్రపంచంలో జనాభా పరంగా తొలిస్థానంలో ఉన్న చైనా.. ఈ ఏడాది జూన్​ నాటికి దేశంలోని 40 శాతం మందికి కరోనా టీకా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. వైరస్​ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్లు పేర్కొన్న చైనా వైద్య నిపుణులు.. అందుకే కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియలో వెనుకబడినట్లు చెప్పుకొచ్చారు. రోజూ 10 మిలియన్ల జనాభాకు టీకా వేసినప్పటికీ.. 70 శాతం మందికి పంపిణీ చేయడానికి ఏడు నెలలు పడుతుందన్నారు.

బ్రూకింగ్​ సంస్థ, సింఘువా విశ్వవిద్యాలయం సోమవారం నిర్వహించిన ఆన్​లైన్​ సదస్సులో అమెరికా వైద్య నిపుణులతో మాట్లాడారు చైనా ఆరోగ్య కమిషన్​ అధికారి ఝాంగ్​ నాన్​షన్​. ఫిబ్రవరి 28 నాటికి దేశంలో 52.52 మిలియన్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. 50 కోట్లకుపైగా డోసులను విదేశాలకు అందించామన్నారు.

టీకాల పంపిణీలో ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనా కాస్త వెనుకపడి ఉంది. చైనా ప్రతి 100 మందికి 3.56 డోసుల పంపిణీతో వెనకంజలో ఉండగా.. ఇజ్రాయెల్​ 94 డోసులతో శరవేగంగా దూసుకుపోతుంది. అమెరికా 22 డోసులను తమ ప్రజలకు అందజేస్తోంది.

ఇదీ చూడండి: 'మే చివరినాటికి వయోజనులందరికీ కరోనా టీకా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.