ETV Bharat / international

చైనాలో మళ్లీ కరోనా ప్రకంపనలు- అమెరికాలో వికృత రూపం - us corona news

కరోనా రక్కసి నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న చైనాలో మళ్లీ కొత్త కేసులు పెరగడం ఆ దేశాన్ని కలవరపెడుతోంది. కొత్తగా 99 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా మొత్తం కేసులు సంఖ్య 82,000 దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతోంది. 24 గంటల్లోనే 1,920మంది మరణించారు.

coronavirus latest news
చైనాలో మళ్లీ కరోనా ప్రకంపనలు
author img

By

Published : Apr 12, 2020, 11:27 AM IST

కరోనా బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాలో కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆ దేశ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తి తగ్గిందని లాక్​డౌన్​ ఎత్తివేశాక మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలోనే అత్యధికంగా 99 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో 97 కేసులు విదేశాల నుంచి చైనా వచ్చినవే అని పేర్కొంది.

కొత్తగా నమోదైన కేసులలో 63 మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా పాజిటివ్​గా తేలినట్లు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. వీరిలో 12మంది విదేశీయులున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు ఈ తరహా కేసులు 1,086 నమోదైనట్లు వివరించింది.

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ను రెండున్నర నెలల తర్వాత ఇటీవలే ఎత్తివేసింది చైనా ప్రభుత్వం. మళ్లీ వైరస్ తీవ్రరూపం దాల్చకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచిస్తోంది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, అవసరమైతే తప్పక ఇళ్లను వీడటం వంటివి కచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తోంది.

అగ్రరాజ్యం కుదేలు..

కరోనా వైరస్ కారణంగా అగ్రరాజ్యం కుదేలవుతోంది. ఒక్కరోజులోనే 1920 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజులతో పోల్చితే ఈ సంఖ్య కాస్త తక్కువ. మహమ్మారి కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 20,500కు పైగా మృతిచెందారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధికం. ఒక్క న్యూయార్క్​ నగరంలోనే 8,627 మంది చనిపోయారు. 1,80,000 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

జాతీయ విపత్తు...

కరోనా వికృతరూపం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి విజృంభణను దేశవ్యాప్త విపత్తుగా గుర్తించారు. దేశంలోని 50 రాష్ట్రాల్లో మహా విపత్తు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. కరోనా పోరుకు 50వేల మంది సైన్యాన్ని రంగంలోకి దించింది ప్రభుత్వం. ప్రజలు ఇళ్లను వీడి బయటకు రావద్దని ఆదేశించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు..

corona cases worldwide
ప్రపంచవ్యాప్తంగా కోరనా కేసులు

ఇదీ చూడండి: అమెరికా చరిత్రలోనే ఇలా చేయడం తొలిసారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.